Share News

జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..

ABN , Publish Date - Feb 17 , 2026 | 02:28 PM

శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మాత్రం సంబంధం లేని అంశాలని సభ దృష్టికి తీసుకొచ్చి.. సభలో పెద్ద డ్రామా సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు..

జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..
AP Minister Kinjarapu Atchannaidu

అమరావతి, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (AP Minister Kinjarapu Atchannaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మాత్రం సంబంధం లేని అంశాలని సభ దృష్టికి తీసుకొచ్చి.. సభలో పెద్ద డ్రామా సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. హిందూ దేవుళ్లపై పగబట్టినట్టుగా వైసీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. హెరిటేజ్‌కు, తిరుపతి లడ్డూకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సంబంధం లేని సంస్థను తిరుపతి లడ్డూ వివాదంలోకి తీసుకువచ్చి రాద్దాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు.


తిరుమల పవిత్రతను దెబ్బతీశారు..

తిరుమల పవిత్రతను దెబ్బతీసింది ఎవరని చిన్న పిల్లలను అడిగినా చెబుతారని అచ్చెన్నాయుడు అన్నారు. తిరుమల పవిత్రతను వైసీపీ నేతలు, జగన్ కుటుంబం దారుణంగా దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. జగన్ బాబాయే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఒప్పుకొన్నారని ప్రస్తావించారు. చేసిన తప్పిదానికి లెంపలేసుకోవాల్సింది పోయి.. ఇంకా వెనకేసుకొచ్చి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆధారాలు ఉంటే చూపించాలని వైసీపీ సభ్యులను చైర్మన్ కోరాలని అన్నారు.


హిందూ సమాజం.. జగన్ అండ్ కోను ఛీకొడుతోంది..

తిరుమల లడ్డూ విషయంలో.. యావత్ హిందూ సమాజం జగన్ అండ్ కోను ఛీకొడుతోందని అచ్చెన్నాయుడు అన్నారు. సభను పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో వైసీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ దేవుళ్లు, హిందూ భక్తులపై జగన్‌తో సహా వైసీపీ నేతలు పగపట్టారని ఆగ్రహించారు. హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని, వైసీపీ నేతల తీరుని ప్రతి ఒక్కరూ ఖండించాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..

ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 17 , 2026 | 05:23 PM