Home » AP Assembly Sessions
వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడంలేదని, సభకు రానివాళ్లు ఎమ్మెల్యేలుగా ఎందుకని, అలాంటివారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. బుధవారం అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కొందరు ఎమ్మెల్యేల దొంగ సంతకాల నివారణకే ఫొటో రికగ్నజేషన్ పెట్టామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఆరు నెలలుగా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం వివిధ స్థాయిలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 17వ తేదీన ఉదయం 10 గంటలకు శాసన మండలి మొదలు కానుంది. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగువారిని గతంలో ‘మదరాసీలు’ అని పిలిచేవారని.. టీడీపీ ఆవిర్భావం తర్వాత మదరాసీ అనే ముద్ర పోయిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి మాత్రమేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చంద్రబాబులాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని అన్నారు.
అమరావతి కోసం రైతులు 1631 రోజుల పాటు పోరాడారని హోంమంత్రి అనిత అన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సుదీర్ఘ కాలం జరిగిన పోరాటం ఇది అని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. శాసనసభలో రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు.
మార్చి 28వ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. రాజధాని అమరావతి చట్టబద్ధత కోసమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ నెల 28వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేశారు.