Yanamala on YCP: వైసీపీ ఎమ్మెల్యేల భవిష్యత్ చెప్పిన యనమల
ABN , Publish Date - Sep 28 , 2025 | 03:27 PM
ప్రతిపక్షహోదా ఇవ్వకుంటే శాసనసభకు రానని భీష్మించుకుని కూర్చొన్న పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేల భవితవ్యం మీద టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు క్లారిటీ..
అమరావతి, సెప్టెంబర్ 28 : ప్రతిపక్షహోదా ఇవ్వకుంటే శాసనసభకు రానని భీష్మించుకుని కూర్చొన్న పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవితవ్యం మీద టీడీపీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి , అతని ఎమ్మెల్యేలు అనర్హతను ఎదుర్కోవాల్సిన అంశం మీద ఆయన రెండు ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించారు.
మొదటగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం అనర్హతను నివారించడానికి జగన్, అతని ఎమ్మెల్యేల గైర్హాజరీని క్షమించడానికి సభ నుండి సెలవును మంజూరు చేయవలసి ఉంటుందని చెప్పారు.
రెండవది, జగన్, అతని ఎమ్మెల్యేలు సభ నుండి సెలవును దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇక, ముఖ్యంగా శాశ్వత బహిష్కరణ కారణంగా 60 రోజులు పూర్తయిన తర్వాత అనర్హతను ఎదుర్కోవడం తప్ప వారికి వేరే మార్గం లేదని యనమల తెలిపారు.
ఈ నేపథ్యంలో జగన్, అతని ఎమ్మెల్యేలు ఎంచుకునే రెండు ఎంపికలలో ఏదన్నది ఇప్పుడు ప్రధానమని యనమల చెప్పారు. ఒకవేళ వారు సభ నుండి సెలవు కోసం దరఖాస్తు చేసుకుంటే, అది సభ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందన్నారు. అంటే పాలకపక్షం, వైసీపీ ఎమ్మెల్యేల సెలవులు ఆమోదించాలని యనమల తెలిపారు.
ఒక వేళ వైసీపీ ఎమ్మెల్యేలు సెలవులు అభ్యర్థించకపోతే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం వారి అనర్హత కచ్చితంగా ఉంటుందని యనమల చెప్పారు. ఈ విషయంలో వారు దేనిని ఎంచుకుంటారు అనేది పెద్ద ప్రశ్న? అని యనమల అభిప్రాయపడ్డారు.
1. వైసీపీ ఎమ్మెల్యేలు 60 రోజుల కంటే ముందే సభను సంప్రదించడం, 2. హాజరు కావడం, 3. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం అనర్హతకు గురికావడం. ఇవే వాళ్ల దగ్గరున్న ఆప్షన్లని యనమల తెలిపారు.
ఇవి కూడా చదవండి..
చొరబాట్లకు సిద్ధంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు.. బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడి
ఇక్కడున్నది ఎవరో మౌలానా మర్చిపోయినట్టున్నారు... యోగి స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి