Share News

Narayana Murthy ON Movie Ticket Prices: సినిమా టికెట్ ధరలు పెంచొద్దు.. ప్రభుత్వాలకు నారాయణ మూర్తి రిక్వెస్ట్

ABN , Publish Date - Sep 27 , 2025 | 06:19 PM

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా టికెట్ ధరలు పెంచడం వల్ల సగటు చిన్న నిర్మాతలు నష్టపోతున్నారని తెలుగు సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమేనని తెలిపారు. అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతారని నారాయణ మూర్తి పేర్కొన్నారు.

Narayana Murthy ON Movie Ticket Prices: సినిమా టికెట్ ధరలు పెంచొద్దు.. ప్రభుత్వాలకు నారాయణ మూర్తి రిక్వెస్ట్
Narayana Murthy ON Movie Ticket Prices

అమరావతి , సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ (TDP MLA Balakrishna) చేసిన కామెంట్స్‌పై... సినీనటుడు చిరంజీవి (Chiranjeevi) స్పందన వందశాతం నిజమని తెలుగు సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి (Narayana Murthy) స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిని కలిసిన వాళ్లలో తాను కూడా ఉన్నానని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం ఎవరినీ అవమానించలేదని చెప్పుకొచ్చారు. చిరంజీవి ఆధ్వర్యంలో తాము జగన్ మోహన్ రెడ్డిని కలసినప్పుడు ఆయన ఎంతో గౌరవం ఇచ్చారని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం తమ సినిమా వాళ్లను అవమానించలేదని తెలిపారు. చిరంజీవిని జగన్ అవమానించారనే ప్రచారం తప్పని చెప్పుకొచ్చారు నారాయణమూర్తి.


చిరంజీవి ఫోన్ చేశారు..

చిరంజీవి తనకు స్వయంగా ఫోన్ చేశారని.. అది ఆయన సంస్కారమని ఉద్ఘాటించారు. అందరూ చిరంజీవి నివాసంలో ఆ సమయంలో కలిశామని గుర్తుచేశారు. చిరంజీవి పరిశ్రమ పెద్దగా జగన్‌తో మాట్లాడారని తెలిపారు. చిరంజీవి వల్లే ఆ రోజు సమస్య పరిష్కారమైందని నొక్కిచెప్పారు. ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం కూడా పరిష్కరించాలని కోరారు. తాను బాలకృష్ణ గురించి మాట్లాడనని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దయచేసి సినిమా టికెట్ ధరలు పెంచకూడదని కోరారు నారాయణమూర్తి.


చిత్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలి..

సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమేనని తెలిపారు. అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. ఈ విషయంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నానని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిల్మ్ ఛాంబర్‌ని, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ని పిలవాలని సూచించారు. పిలిచి వారితో మాట్లాడి తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలను తెలుసుకోవాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి టికెట్ ధరలు పెంచనని చెప్పారని, మిడ్ నైట్‌షోలను వేయనని చెప్పిన మాటలకి సెల్యూట్.. అదే మాట మీద ఆయన నిలబడాలని కోరారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా టికెట్ ధరలు పెంచడం వల్ల సగటు చిన్న నిర్మాతలు నష్ట పోతున్నారని ఆర్.నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

గుడ్ న్యూస్.. మరో పథకాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2025 | 06:39 PM