Home » Tollywood
హీరోయిన్ల విషయంలో చేసిన వ్యాఖ్యలకు నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు. తన 30 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు.
ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నోటీసులు కూడా ఇచ్చింది. ఈక్రమంలో ఆయన క్షమాపణలు చెప్పారు.
ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై వాయిస్ ఆఫ్ ఉమెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మా అసోసియేషన్‌కు వాయిస్ ఆఫ్ ఉమెన్ శుక్రవారం లేఖ రాసింది. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించింది.
ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది.
ప్రముఖ సినీనటి ఆమని శనివారం భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరనున్నారు. ఈ చేరిక కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరగనుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారు.
ఒకప్పటి స్టార్ హీరో, దివంగత నటుడు శోభన్ బాబు ‘సోగ్గాడు’ సినిమా 1975లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా రిలీజయి 50 ఏళ్లు పూర్తవడంతో హైదరాబాద్‌లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సినీ నటులు చిరంజీవి, నాగార్జునలతో పాటు పలువురు ప్రముఖులు శనివారం ప్రజాభవన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై భట్టితో చర్చించారు.
చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో నివేదికపై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరజ్వాద స్పందించారు. గతంలో చిత్రపురి కమిటీలో సభ్యుడిగా ఉన్నందుకే తన పేరు నివేదికలో ఉందని చెప్పారు. తానేమీ డబ్బులు తినలేదని అన్నారు. అది తన బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నానని చెప్పారు.
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసుపై నాంపల్లి కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. నిందితుడు రవిని మూడోసారి కస్టడీకి అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే మరో నాలుగు కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
టాలీవుడ్ హీరో ధర్మ మహేశ్ భార్య గౌతమి చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సోమవారం బిగ్‌బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గౌతమి చౌదరిపై కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.