Share News

Kukatpally Tragic Incident: మన శంకర వరప్రసాద్ సినిమా థియేటర్‌లో తీవ్ర విషాదం

ABN , Publish Date - Jan 12 , 2026 | 02:08 PM

హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలోని అర్జున్ థియేటర్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మెగాస్టార్ సినిమా చూస్తూ ఆనంద్ కుమార్ అనే వ్యక్తి అకస్మాత్తుగా మృతిచెందడం కలకలం రేపింది.

Kukatpally Tragic Incident: మన శంకర వరప్రసాద్ సినిమా థియేటర్‌లో తీవ్ర విషాదం
Kukatpally Tragic Incident

హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలోని అర్జున్ థియేటర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా (Mana Shankara Varaprasad Movie) ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన విషయం తెలసిందే. ఈ క్రమంలోనే తన అభిమాన నటుడు చిరంజీవి చిత్రం కావడంతో ఆనంద్ కుమార్ అనే వ్యక్తి అర్జున్ థియేటర్లో టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈ సినిమా చూస్తూ ఆనందిస్తున్న సమయంలో ఆనంద్ కుమార్ అకస్మాత్తుగా మృతిచెందడం కలకలం రేపింది. ఈ ఘటనతో థియేటర్‌లో విషాద వాతావరణం నెలకొంది.


సినిమా చూస్తుండగా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సినిమా చూస్తున్న సమయంలో ఆనంద్ కుమార్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుర్చీలోనే కుప్పకూలిపోయిన అతన్ని గమనించిన ప్రేక్షకులు థియేటర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు అనుమానించారు.

రిటైర్డ్ ఏఎస్ఐగా గుర్తింపు

మృతుడు ఆనంద్ కుమార్ గతంలో 12వ బెటాలియన్‌లో ఏఎస్ఐగా పనిచేసి రిటైరైనట్లు తెలుస్తోంది. సినిమా చూడటానికి థియేటర్‌కు వచ్చిన ఆయనకు ఇలాంటి సంఘటన జరగడం కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచింది.


గుండెపోటే కారణమా..

ఆనంద్ కుమార్ గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఖచ్చితమైన కారణం వైద్యుల నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని పోలీసులు స్పష్టం చేశారు.

మృతదేహం తరలింపు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. థియేటర్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

అనుమానాస్పద మృతి కేసు నమోదు

ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆనంద్ కుమార్ కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నల్లమల సాగర్‌పై సుప్రీంలో ఊహించని పరిణామం..

భూములు అమ్మి ఖజానా నింపే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు: మంత్రి పొంగులేటి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 12 , 2026 | 02:27 PM