Ponguleti Srinivas Reddy: భూములు అమ్మి ఖజానా నింపే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:40 PM
తమ ప్రభుత్వం పేదల భూములకు రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల 39 సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి12 (ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వం పేదల భూములకు రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) వ్యాఖ్యానించారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల 39 సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వాటిని 12 క్లస్టర్‌లుగా విభజించి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు వీటి నిర్మించేందుకు ముందుకురావడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు.
కూకట్‌పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. డబ్బే తమ ప్రభుత్వానికి ప్రాధాన్యం కాదని స్పష్టం చేశారు. భూములు అమ్మి ఖజానా నింపే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ అవసరాలకు భూములు తీసుకుంటే డబ్బులతో పాటు వారికి ఇళ్లను నిర్మించి ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఖాళీ స్థలాలు ఆక్రమిస్తున్నారు: ఎంపీ ఈటల

హౌసింగ్ కాలనీల్లో.. 40ఏళ్ల క్రితం వేసిన లేఅవుట్లలో ఖాళీ స్థలాలు బై నంబర్స్ వేసి ఆక్రమిస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడలేదని మరికొన్ని చోట్లా వేలం వేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం తలుచుకుంటే కాపడకపోవడం అనేది ఉండదని ఆయన అన్నారు. అలాంటి భూములు వేలం వేయకుండా పార్కులు చేసి ప్రభుత్వం రక్షించాలను సూచించారు. పోలీస్ స్టేషన్లు.. భూముల పంచాయతీలు పరిష్కరించే కేంద్రాలుగా మారొద్దని ఆయన కోరారు. 40ఏళ్ల క్రితం పేదలకు ఇచ్చిన స్థలాలను బ్రోకర్లు కబ్జా చేస్తున్నారని ఆరోపణలు చేశారు ఈటల. పేదలు కొనుక్కున్న భూములకు రక్షణ కల్పించాలని సూచించారు. HMT, IDPLలో పేదలు కొన్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ ప్రభుత్వం ధనికుల కోసం పనిచేయడం కాదని.. పేదల సమస్యలు పరిష్కరించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత..
పోలవరం నల్లమల సాగర్ లింక్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ
Read Latest Telangana News And Telugu News