Share News

Supreme Court: పోలవరం నల్లమల సాగర్ లింక్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:48 AM

పోలవరం - నల్లమల సాగర్‌ లింక్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగుతోంది. ఈ విచారణకు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంలో తెలంగాణ రిట్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Supreme Court: పోలవరం నల్లమల సాగర్ లింక్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ
Supreme Court

ఢిల్లీ, జనవరి12 (ఆంధ్రజ్యోతి): పోలవరం - నల్లమల సాగర్‌ లింక్‌ ప్రాజెక్టుపై (Polavaram-Nallamala Link Project) సుప్రీంకోర్టులో(Supreme Court) సోమవారం విచారణ జరుగుతోంది. ఈ విచారణకు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) హాజరయ్యారు. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంలో తెలంగాణ సర్కార్ రిట్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని సీజేఐ ధర్మాసనం సూచించింది. మధ్యవర్తిత్వం ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవాలని కూడా మార్గనిర్దేశం చేసింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ వద్ద తెలంగాణ వాదనలు వినిపించుకోవచ్చనీ అభిప్రాయపడింది.


ఎలాంటి అనుమతులు లేవు..

అయితే.. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి మళ్లీ తమ వాదనలు వినిపిస్తానని గత విచారణ సందర్భంగా సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేనందున ప్రాజెక్టు పనులు ఆపాలని తెలంగాణ సర్కార్‌కు తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాది అబిషేక్ మను సింఘ్వీ మరోసారి వాదనలు వినిపిస్తున్నారు.


గోదావరిపై ఏపీ ప్రాజెక్టు..

పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ లేదా నల్లమల సాగర్‌ జలాశయానికి లింక్‌ చేసేలా గోదావరిపై ఏపీ ప్రాజెక్టు నిర్మిస్తోందంటూ రిట్‌ పిటిషన్‌లో తెలంగాణ పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని, ఆ పనులను తక్షణమే నిలిపివేసేలా పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాలని అభ్యర్థించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మేరకే పోలవరం ప్రాజెక్టు స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్టవిరుద్ధమని పిటీషన్‌లో పేర్కొంది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమల సాగర్‌ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సమంజసం కాదని చెప్పింది. ఈ ప్రాజెక్టుపై తదుపరి చర్యలు చేపట్టరాదంటూ జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జలసంఘం, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని రిట్‌ పిటిషన్‌లో పేర్కొంది తెలంగాణ. అయితే.. వరద జలాలను మాత్రమే తాము వాడుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ బదులిచ్చింది.


బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా..

బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టును నిలిపివేయాలని తెలంగాణా సర్కార్ పిటిషన్‌లో ప్రస్తావించింది. గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా నల్లమల్ల సాగర్‌కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కొత్త ప్రాజెక్టును ప్రతిపాదించిందని చెబుతోంది. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని ఇదివరకే కేంద్ర జలశక్తి శాఖకు, జల వనరుల సంఘానికి లేఖ రాసింది. పోలవరం నల్లమల్ల సాగర్ కోసం ఏపీ ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ. తమ ప్రయోజనాలకు నష్టం కలిగించే నిబంధనలు, విభజన చట్టానికి వ్యతిరేకంగా బనకచర్ల లింకు ప్రాజెక్టు చేపట్టకుండా చూడాలని కోరింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత..

బోరబండలో ఉన్మాది ఘాతుకం.. మాట్లాడటం లేదన్న అనుమానంతో...

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 12 , 2026 | 12:54 PM