Share News

Konijeti Rosaiah Wife Passes Away: మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత..

ABN , Publish Date - Jan 12 , 2026 | 07:07 AM

దివంగత మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సతీమణి కొణిజేటి శివలక్ష్మి కన్నుమూశారు. వారి మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది.

 Konijeti Rosaiah Wife Passes Away: మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత..
Konijeti Rosaiah Wife Passes Away

హైదరాబాద్, జనవరి12(ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) సతీమణి కొణిజేటి శివలక్ష్మి(86) కన్నుమూశారు. వారి మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. శివలక్ష్మి ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ అమీర్‌పేటలోని తన నివాసంలో కన్నుమూశారు. శివలక్ష్మి మరణం వారి కుటుంబంలోనే కాకుండా, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదం నింపింది.


రాజకీయ ప్రముఖుల సంతాపం

శివలక్ష్మి మరణ వార్త తెలియగానే తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అమీర్‌పేటలోని రోశయ్య నివాసానికి అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకొని ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.

రోశయ్యకు శివలక్ష్మి అండగా ఉంటూ, ఆయన రాజకీయ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారని బంధుమిత్రులు తెలిపారు. రోశయ్య సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పినప్పటికీ.. శివలక్ష్మి తెర వెనకే ఉంటూ కుటుంబాన్ని చక్కదిద్దేవారని బంధుమిత్రులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బండ్ల గణేశ్ మహా పాదయాత్ర.. ఎందుకంటే..

టార్గెట్ మున్సిపోల్స్.. బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 12 , 2026 | 07:59 AM