Actor Bandla Ganesh: బండ్ల గణేశ్ మహా పాదయాత్ర.. ఎందుకంటే..
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:02 PM
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తన వ్యక్తిగత మొక్కును తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయన తన స్వగ్రామమైన షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు మహా పాదయాత్ర చేపట్టనున్నారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, జనవరి10(ఆంధ్రజ్యోతి): ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (Actor Bandla Ganesh) తిరుమల (Tirumala) వేంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకోనున్నారు. షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయ, సినీ వర్గాల్లో ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. బండ్ల గణేశ్ పాదయాత్ర నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు ఆయన సంకల్పాన్ని మెచ్చుకుంటూనే, ఇంత దూరం నడవడం అంటే చిన్న విషయం కాదని అభిప్రాయపడుతున్నారు.
కారణమిదే..
సీఎం నారా చంద్రబాబు నాయుడు.. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన సమయంలో బండ్ల గణేశ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చంద్రబాబు నాయుడు నిర్దోషిగా విడుదల కావాలని, తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆయన తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించి చంద్రబాబు మళ్లీ సీఎం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకునేందుకు బండ్ల గణేశ్ సిద్ధమయ్యారు. చంద్రబాబు పట్ల తనకున్న అభిమానాన్ని ఈ యాత్ర ద్వారా బండ్ల గణేశ్ చాటుకుంటున్నారు. తాజాగా ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడమే కాకుండా, తన రాజకీయ అభిమానాన్ని కూడా చూపనున్నారు.
పాదయాత్ర షెడ్యూల్ ఇలా..
బండ్ల గణేశ్ ఈ నెల 19వ తేదీన షాద్‌నగర్‌లోని తన స్వగృహం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ మహా పాదయాత్రలో రోజూ నిర్దిష్ట దూరం నడవడం, భక్తులతో కలిసి శ్రీవారి నామస్మరణ, భక్తి వాతావరణంలో ప్రయాణమే లక్ష్యంగా ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 19వ తేదీన షాద్‌నగర్‌లోని తన స్వగృహం నుంచి భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించి పాదయాత్రను ప్రారంభించనున్నారు. కాలినడకన తిరుమల చేరుకుని, శ్రీవారిని దర్శించుకుని తన మొక్కును సమర్పించుకుంటారు.
రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తి..
బండ్ల గణేశ్ నిర్ణయం రాజకీయ, సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చంద్రబాబుకి సంబంధించిన అంశం కావడంతో ఈ పాదయాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోంది. షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు బండ్ల గణేశ్ చేపట్టనున్న మహా పాదయాత్ర భక్తి, రాజకీయ ప్రాధాన్యత కలగలిపిన కార్యక్రమంగా మారనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
టార్గెట్ మున్సిపోల్స్.. బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ..
అంబర్‌పేట్ ఎస్ఐ భానుప్రకాశ్‌రెడ్డి అరెస్ట్.. ఏమైందంటే..
Read Latest Telangana News And Telugu News