హగ్ చేసుకోవాలనుకుంటే చీరల్లో వచ్చారు : నరేష్
ABN , Publish Date - Feb 12 , 2026 | 09:13 PM
నేడు 'హగ్ డే' పురస్కరించుకుని నటుడు నరేష్ హాట్ కామెంట్స్ చేశారు. సినిమా వేడుకకు హాజరైన ఆయన.. 'మిమ్మల్ని కూడా హగ్ చేసుకోవాలనే వచ్చాను కానీ.. మీరు లక్షణంగా చీరలు ధరించారు' అంటూ హీరోయిన్ల గురించి వ్యాఖ్యానించారు.
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 12: ‘కొన్ని పరిణామాల తర్వాత సినిమా ఫంక్షన్స్‌లో మహిళలందరూ చీరల్లోనే కనిపిస్తున్నారు.. ఇది భారతీయ సంస్కృతి అని సినీ నటుడు నరేష్ అన్నారు. ఒక సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను నరేశ్ పరోక్షంగా గుర్తు చేసుకున్నారు.
నేడు (గురువారం) హగ్ డే సందర్భంగా వేదికపై ఉన్న హీరోలు, దర్శక నిర్మాతలను హగ్ చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంలో నరేష్ మాట్లాడుతూ.. చిత్రంలో నటించిన హీరోయిన్లు శివానీ నాగారం, స్రవంతి చొక్కారపు, యాంకర్ గీతాభగత్‌కు కూడా శుభాకాంక్షలు చెప్పి.. ‘మిమ్మల్ని కూడా హగ్ చేసుకోవాలనే వచ్చాను కానీ.. మీరు లక్షణంగా చీరలు ధరించారు. అంటూ నరేష్ చెప్పుకొచ్చారు.