Share News

Madhavilata: మాధవీలతకు బిగ్ షాక్.. కేసు నమోదు

ABN , Publish Date - Dec 29 , 2025 | 04:46 PM

ప్రముఖ సినీనటి మాధవీలతకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో సాయిబాబా దేవుడు కాదని తప్పుడు ప్రచారాలు, వ్యాప్తి చేసినందుకు మాధవీలతపై కేసు నమోదు చేశారు.

Madhavilata: మాధవీలతకు బిగ్ షాక్.. కేసు నమోదు
Actress Madhavilata

హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటి మాధవీలతకు (Actress Madhavilata) బిగ్ షాక్ తగిలింది. ఆమెపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో సాయిబాబా దేవుడు కాదని తప్పుడు ప్రచారాలు, వ్యాప్తి చేసినందుకు మాధవీలతపై కేసు నమోదు చేశారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... నటి మాధవీలతతో పాటు, ఈ ప్రచారానికి పాల్పడిన పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కూడా ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


వారు పెట్టిన పోస్టు వల్ల ప్రజల భావోద్వేగాలకు నష్టం జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు. రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలకు మాధవీలతతో పాటు మిగతా యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులోని ఇతర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో వారి సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టినట్లు సమాచారం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

హరీశ్‌రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ఫైర్

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన కామెంట్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 29 , 2025 | 05:00 PM