Raja Saab Movie Ticket Price: రాజాసాబ్ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి..
ABN , Publish Date - Jan 09 , 2026 | 08:29 AM
రాజాసాబ్ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీఓ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది..
హైదరాబాద్, జనవరి9 (ఆంధ్రజ్యోతి): రాజాసాబ్ సినిమా టికెట్ ధరలను (Raja Saab Movie Ticket Price) పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయంతో థియేటర్లలో పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి.
సింగిల్ స్క్రీన్లలో పెరిగిన టికెట్ ధరలు..
తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలు ఇలా పెరిగాయి.
తొలి 3 రోజులు:
➤ ఒక్కో టికెట్‌పై రూ.105 వరకు పెంచుకునే అవకాశం.
తర్వాత 7 రోజులు
➤ జనవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పెంచుకునే అవకాశం.
➤ ఒక్కో టికెట్‌పై రూ.62 వరకు పెంచుకునే అవకాశం.
మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్ల పెంపు..
మల్టీప్లెక్స్ థియేటర్లలో సింగిల్ స్క్రీన్ల కంటే ఎక్కువగా ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తొలి 3 రోజులు:
➤ ఒక్కో టికెట్‌పై రూ.132 వరకు పెంచుకునే అవకాశం.
తర్వాత 7 రోజులు
➤ ఒక్కో టికెట్‌పై రూ.89 వరకు పెంచుకునే అవకాశం.
20శాతం సంక్షేమ నిధికి...
పెరిగిన ఆదాయంలో 20శాతం సంక్షేమ నిధికి తెలంగాణ సర్కార్ వినియోగించనుంది. టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు ఆదాయం నుంచి 20 శాతం మొత్తాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్కర్స్ సంక్షేమ నిధికి జమ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిధి నిర్వహణ కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) ప్రత్యేక బ్యాంక్ ఖాతాను ప్రారంభించనుంది.
థియేటర్లలో అవగాహన ప్రకటనలు తప్పనిసరి..
టికెట్ ధరల పెంపునకు అనుమతితో పాటు ప్రభుత్వం కొన్ని కీలక నిబంధనలను కూడా విధించింది. థియేటర్లలో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం, నార్కోటిక్స్‌పై అవగాహన, సైబర్ క్రైమ్‌పై హెచ్చరికలకు సంబంధించిన అవగాహన ప్రకటనలను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించింది తెలంగాణ సర్కార్.
నిబంధనల అమలుపై కఠిన పర్యవేక్షణ..
ప్రభుత్వ ఆదేశాల అమలుపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, లైసెన్సింగ్ అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని జీఓలో స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే థియేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ సర్కార్ హెచ్చరించింది.
సినిమా పరిశ్రమకు ఊతం..
టికెట్ ధరల పెంపు నిర్ణయం సినిమా పరిశ్రమకు ఆర్థికంగా ఊతమిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే సాధారణ ప్రేక్షకులపై భారం పెరుగుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వడంతో.. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. పెరిగిన ఆదాయాన్ని సినిమా కార్మికుల సంక్షేమానికి వినియోగించడమే ఈ నిర్ణయంలోని ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..
విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులపై క్లారిటీ..
Read Latest Telangana News And Telugu News