Sankranti Holidays: విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులపై క్లారిటీ..
ABN , Publish Date - Jan 06 , 2026 | 07:32 AM
సంక్రాంతి సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
హైదరాబాద్, జనవరి6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) 2026 సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సెలవులను (Sankranti Holidays) ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య పాఠశాలలకు వర్తిస్తాయని పేర్కొంది.
కనుమ రోజు సెలవు
జనవరి 16వ తేదీన కనుమ రోజును పురస్కరించుకుని ఐచ్ఛిక సెలవు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కనుమ రోజున రైతులు తమ పండుగను ప్రత్యేకంగా చేసుకుంటారు. కనుమ రోజున ఉత్సవాలు, పండుగ సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
17 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం
జనవరి 17వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులను తమ ఇళ్లకు తీసుకురావడానికి తల్లిదండ్రులు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హై టెన్షన్.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్
అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండ.. అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన భట్టి
Read Latest Telangana News And Telugu News