Home » School life
తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాలలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.
తుఫాన్ తీవ్రత నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ సెలవులు ప్రకటించారు.
‘నాకు మా అమ్మ మొదటి గురువు.. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను. నాకు మంచి క్రమశిక్షణను మా ఉపాధ్యాయులు నేర్పారు’ అని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
తాను చదువుకునే రోజుల్లో భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడి చేతిలో దెబ్బలు తిన్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఏపీ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. ఆయా హాస్టళ్లు, గురుకులాలు, వాటి పరిసరాలు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.
అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 3వేల పోస్టులు భర్తీ చేయబోతున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలోనూ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత నాలుగేళ్లుగా జననాల రేటు తగ్గుతుండడమే దీనికి కారణమని తెలుస్తోంది. 2025-26లో అన్ని మేనేజ్‌మెంట్ల పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 84.37 లక్షలుగా ఉంది.
ఎయిడెడ్ పాఠశాలల మూసివేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల సందర్బంగా అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ సంక్షేమ హాస్టళ్లపై చర్చించారు.