నా భవిష్యత్తు విద్యార్థులపై ఆధారపడి ఉంది: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Jul 24 , 2026 | 01:15 PM
ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు తాను మాట ఇచ్చానని పేర్కొన్నారు.
పోలవరం జిల్లా , జులై 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు తాను మాట ఇచ్చానని పేర్కొన్నారు. ఈరోజు (శుక్రవారం) పోలవరం జిల్లా రంపచోడవరంలో మంత్రి లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హైస్కూలు - జూనియర్ కళాశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖాముఖి సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. రంపచోడవరం ప్రాంతంలోని గిరిజనుల కష్టాన్ని నమ్ముకుంటున్నారని తెలిపారు.
మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి..
ప్రేమ, సేవ, త్యాగం ఉన్నచోట దేవుడు ఉంటారని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను పిల్లలు గౌరవించాలని సూచించారు. పదోతరగతి, ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల ఫొటోలతో పేపర్ యాడ్ వేశామని ప్రస్తావించారు. విద్యార్థులు బాగా చదవకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు తనను మందలిస్తారని అన్నారు. తన భవిష్యత్తు విద్యార్థులపై ఆధారపడి ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలని పిలుపునిచ్చారు.
డీఎస్సీ ద్వారా మూడు వేల పోస్టులు భర్తీ చేస్తాం..
ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు తీసుకురావాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి ఉద్ఘాటించారు. ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మూడు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. లక్షా 10 వేల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. దారితప్పిన విద్యావ్వవస్థను తాము గాడిలో పెట్టడానికి చర్యలు చేపట్టామని అన్నారు. గిరిజన ప్రాంతంలో 200 ప్రభుత్వ పాఠశాలలకు శాశ్వతంగా భవనాలు నిర్మిస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవతా విగ్రహాలపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: మంత్రి ఆనం
అమరావతికి ప్రముఖ విద్యాసంస్థలు వస్తున్నాయి: మంత్రి గొట్టిపాటి
భూమన ఆక్రమించిన భూముల స్వాధీనానికి ఏపీ ప్రభుత్వం చర్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News