భూమన ఆక్రమించిన భూముల స్వాధీనానికి ఏపీ ప్రభుత్వం చర్యలు
ABN , Publish Date - Jul 23 , 2026 | 01:59 PM
తిరుచానూరు పరిధిలోని స్వర్ణముఖి నది తీరంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమించిన భూముల స్వాధీనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సర్వే నంబర్ - 47/1 లో 5.1 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటోంది.
తిరుపతి, జులై 23 (ఆంధ్రజ్యోతి): తిరుచానూరు పరిధిలోని స్వర్ణముఖి నది తీరంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఆక్రమించిన భూముల స్వాధీనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) చర్యలు చేపట్టింది. సర్వే నంబర్ - 47/1లో 5.1 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటోంది. అలాగే, సర్వే నంబర్ 47/5లో 3.7 ఎకరాల భూమి స్వాధీనానికి చర్యలు చేపట్టింది. స్వాధీనం చేసుకున్న భూముల వద్ద ఇది ప్రభుత్వ భూమి అని అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. జేసీబీలతో భూమన ఆక్రమిత భూముల చుట్టూ ఉన్న ప్రహారీలను రెవెన్యూ అధికారులు కూలగొడుతున్నారు. వందలాదిమంది పోలీసులతో ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమిత భూములను పరిశీలించడానికి అక్కడికి సాధు పరిషత్తు స్వాములు చేరుకున్నారు. ఆ స్థలం వద్దకు సాధు పరిషత్తు స్వాములను పోలీసులు అనుమతించలేదు. దూరం నుంచే మీడియాతో సాధు పరిషత్ స్వాములు మాట్లాడారు.
భూమనను ప్రజలు త్వరలోనే తరిమికొడతారు: శ్రీనివాసానంద
భూమన కరుణాకర్ రెడ్డిని తిరుపతి ప్రజలు త్వరలోనే తరిమికొడతారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించారు. భూమన కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసిన ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని సూచించారు.
ఆ భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి: అట్లూరి నారాయణ
భూమన కరుణాకర్ రెడ్డి భూకబ్జాలను వెనక్కు తీసుకున్నందుకు కూటమి ప్రభుత్వానికి ఏపీ సాధుపరిషత్ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణ ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ రికార్డులను కూడా మార్చాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూబకాసురుల భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూమన సాత్వికుడిగా మాట్లాడుతూ కబ్జాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. లక్ష టిప్పర్లతో కాంక్రీట్ పోశారని ఆరోపించారు. భూమన అభినయరెడ్డి రెవెన్యూ అధికారులను, పోలీసులనే బెదిరిస్తున్నారని అట్లూరి నారాయణ ఆగ్రహించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ కీలక ప్రాజెక్టులపై చర్చ
తమ్మినేని సీతారాం భూ భాగోతాలపై విచారణ చేస్తున్నాం: అచ్చెన్నాయుడు
ఆ మైదానంలో ఆక్రమణలు లేకుండా చర్యలు: మంత్రి టీజీ భరత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News