ఆ మైదానంలో ఆక్రమణలు లేకుండా చర్యలు: మంత్రి టీజీ భరత్
ABN , Publish Date - Jul 22 , 2026 | 09:19 AM
అవుట్ డోర్ స్టేడియంలో రూ.2.5 కోట్లతో సింథటిక్ వాకింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్ట్ నిర్మిస్తున్నామని మంత్రి టీజీ భరత్ గుప్తా వ్యాఖ్యానించారు.
కర్నూలు జిల్లా, జులై 22 (ఆంధ్రజ్యోతి): అవుట్ డోర్ స్టేడియంలో రూ.2.5 కోట్లతో సింథటిక్ వాకింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్ట్ నిర్మిస్తున్నామని మంత్రి టీజీ భరత్ గుప్తా (AP Minister TG Bharat) వ్యాఖ్యానించారు. క్రీడాకారుల కోసం ప్రపంచస్థాయి ప్రమాణాలతో సింథటిక్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలో పికిల్ బాల్ కోర్టును మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అవుట్ డోర్ స్టేడియంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రత్యేక నిధులు సమకూర్చి ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఏపీలో క్రీడలపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. ఎస్టీ, బీసీ కళాశాల మైదానంలో ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి టీజీ భరత్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగనివ్వబోం: ప్రధాని మోదీ
ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలి: ఎంపీ చామల
ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులకు నయా రూల్స్ .!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News