Share News

ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలి: ఎంపీ చామల

ABN , Publish Date - Jul 21 , 2026 | 01:59 PM

పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు అడిగిన వాటికి కేంద్రం ఎందుకు సమాధానం చెప్పట్లేదని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలి: ఎంపీ చామల
Congress MP Chamala Kiran Kumar Reddy

ఢిల్లీ, జులై 21 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు ప్రస్తావించిన అంశాలపై కేంద్రం ఎందుకు సమాధానం చెప్పట్లేదని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Congress MP Chamala Kiran Kumar Reddy) ప్రశ్నించారు. ఈరోజు (మంగళవారం) ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీజేపీ పార్టీ మద్దతుదారు, కార్యకర్తలను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎంపీలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడారు. నిన్న సీజేపీ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు లాఠీ‌ఛార్జ్ చేశారని అన్నారు. ఈ ఘటనలో పలువురు సీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని వెల్లడించారు.


ధర్మేంద్ర ప్రధాన్‌ని ఎందుకు కాపాడుతున్నారు..

ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో సీజేపీ కార్యకర్తలను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి పరామర్శించినట్లు ఎంపీ చామల చెప్పుకొచ్చారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు.


ప్రజా సమస్యలను మోదీ పరిష్కరించాలి..

ధర్మేంద్ర ప్రధాన్‌తో ఎందుకు రాజీనామా చేయించట్లేదని ఎంపీ చామల నిలదీశారు. ప్రధాని మోదీని మూడోసారి ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు. ప్రజా సమస్యలను మోదీ పరిష్కరించే దిశగా ఎందుకు ముందుకు పోవట్లేదని నిలదీశారు. రైతులు హరియాణాలో ఆందోళన చేస్తున్నారని, వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలి: ప్రధాని మోదీ

సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్‌.. ఎమ్మెల్యేల అలర్ట్

పామాయిల్ ధర పెంపునకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది: భట్టి విక్రమార్క

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 21 , 2026 | 02:30 PM