పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలి: ప్రధాని మోదీ
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:29 AM
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.
ఢిల్లీ, జులై 20 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ సమావేశాలు (Parliament Session) సజావుగా సాగేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) వ్యాఖ్యానించారు. ఈ సమావేశాలు నిర్మాణాత్మకంగా జరుగుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. గత నెల రోజులుగా దేశంలో అనేక పరిణామాలు జరిగాయని వెల్లడించారు. అంతరిక్ష ప్రస్థానంలో నవశకం ప్రారంభమైందని తెలిపారు.స్టార్టప్ కంపెనీ తయారు చేసిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిందని వివరించారు. ఈరోజు(సోమవారం) పార్లమెంట్ దగ్గర మీడియాతో ప్రధాని మాట్లాడారు. భారత అంతరిక్ష ప్రస్థానంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైందని ఉద్ఘాటించారు.
భారతదేశ యువత అంతరిక్షంలోకి దూసుకుపోయిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. విక్రమ్-1 విజయం వెనుక యువత పాత్ర కీలకమని తెలిపారు. స్కైరూట్ విజయవంతం అవడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని దేశానికి అంకితం చేశామని వెల్లడించారు. ఒక సెమీ కండక్టర్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ రైలును ప్రారంభించామని తెలిపారు. యుద్ధంతో చాలా దేశాలకు నష్టం జరుగుతోందని చెప్పారు. చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయని తెలిపారు. 7.7శాతం గ్రోత్‌రేట్ భారత్ నమోదు చేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అయోధ్య విరాళాల వివాదం.. కేంద్రానికి ఖర్గే, రాహుల్ లేఖ
గాంధీభవన్ చుట్టూ తిరిగితే కుదరదు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి క్లాస్
టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కి ఈశ్వరమ్మ లేఖ.. ఎందుకంటే
Read Latest AP News And Telangana News And National News
And Telugu News