Home » Parliament Special Session
దేశంలో పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేపర్లకే పరిమితం అవుతుంది కానీ రైతులకు న్యాయం జరగడం లేదని చెప్పుకొచ్చారు. 16వ ఫైనాన్స్ కమిషన్ నివేదికపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరారు.
బీసీ రిజర్వేషన్లు 42 శాతం కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు బుధవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు డీఎంకే ఎంపీ కనిమొళి మద్దతు తెలిపారు. రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలని కనిమొళి డిమాండ్ చేశారు.
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం నాడు ఆందోళన చేపట్టారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉగ్రవాదులను హతమార్చడం అనుమానాలకు తావిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దేశంలో ప్రతి దు:ఖపూరిత ఘటనను బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ నేతలు వారి స్వలాభం కోసం రాజకీయంగా వాడుకుంటాయని నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పహల్గాం ఉగ్రదాడి జరిగి 100 రోజులైన తర్వాత కూడా ఆ దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులను పట్టుకోవడంలో కేంద్ర వైపల్యాన్ని గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. ఘటన జరిగిన ఇన్ని రోజులైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు తీరుపై పార్లమెంట్‌లో మాట్లాడానని తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ప్రతి పంటకు బీమా ఉండాలని, పంట నష్టం జరగకుండా చూడాలని కోరామని అన్నారు. వైసీపీ రైతు ప్రభుత్వమని చెప్పింది.. కానీ పూర్తిగా రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి.
కేంద్ర అఖిలపక్ష సమావేశం, పార్లమెంట్ సమావేశాలపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ స్పందించారు. పహల్‌గామ్ ఉగ్రదాడి, ట్రంప్ ప్రకటనలు, ఆపరేషన్ సిందూర్, చైనా పాత్రతో సహా వివిధ అంశాలపై పార్లమెంట్ లో 2 నుంచి 3 రోజుల పాటు చర్చ జరగాలని సూచించారు. బీహార్‌లో ఓట్ల రద్దు, పహల్‌గామ్ ఉగ్రదాడి, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా అంశాలను పార్లమెంట్‌లో తాము లేవనెత్తుతామని చెప్పుకొచ్చారు.
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీపై ప్రధానికి లేఖ రాశారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ నియామకం ఆలస్యమవుతుండటంపై లేఖలో మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.
భారత్ - పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. మోదీ సర్కారుకి సరికొత్త ప్రతిపాదనలు చేసింది. తక్షణమే ఆ రెండు పనులు చేపట్టండంటూ..