Share News

నాటుకోడి ధరలపై ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆవేదన

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:20 PM

పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వేదికగా నాటుకోడి మాంసం ధరల పెరుగుదలపై అవినాశ్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

నాటుకోడి ధరలపై  ఎంపీ  అవినాశ్‌రెడ్డి ఆవేదన
Kadapa MP Avinash Reddy

ఢిల్లీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి (Kadapa MP Avinash Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వేదికగా నాటుకోడి మాంసం ధరల పెరుగుదలపై అవినాశ్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నాటుకోడి మాంసం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రస్తావించారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మటన్ కంటే నాటుకోడి ఖరీదా?..

అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మటన్ ధరలకంటే నాటుకోడి మాంసం ధరలు ఎక్కువగా ఉంటే, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని పార్లమెంటులో ప్రశ్నించారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన నాటుకోడి మాంసం, ప్రస్తుతం సామాన్యులకు అందని స్థాయికి చేరిందని అవినాశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.


ఒక్క మాటలో తేల్చేసిన కేంద్రం..

ఈ ప్రశ్నకు కేంద్రప్రభుత్వం తరఫున కేంద్రమంత్రి లలన్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నాటుకోడి మాంసం ధరలు మటన్ కంటే ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలను లలన్ సింగ్ పూర్తిగా ఖండించారు.


కేంద్రం తెలిపిన వివరాలిలా..

మటన్ ధర రూ. 900 వరకు, నాటుకోడి మాంసం ధర సగటున రూ. 500 మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఈ ధరల ప్రకారం.. నాటుకోడి మాంసం మటన్ కంటే తక్కువ ధరకే లభిస్తున్నట్లు లలన్ సింగ్ తెలిపారు.


రాజకీయ వర్గాల్లో చర్చ..

ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ధరల వాస్తవ పరిస్థితి వేరు, కేంద్రం చెప్పిన గణాంకాలు వేరనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాటుకోడి మాంసం ధరలపై పార్లమెంట్‌లో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి లేవనెత్తిన ప్రశ్న, కేంద్ర, రాష్ట్రాల మధ్య ధరల వాస్తవ పరిస్థితులపై మరోసారి చర్చకు తెరలేపింది. కేంద్రం మాత్రం అధికారిక గణాంకాలతో ఒక్క మాటలో సమాధానం ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ వేదికపై భారత్ స్థానం మరింత బలోపేతం: పవన్ కల్యాణ్

ఏసీబీ రైడ్స్.. సచివాలయ అడ్మిన్ గుట్టు రట్టు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 02:35 PM