Home » Central Govt
వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఇవాళ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈ క్రమంలో అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ గురువారం వెంకటపాలెం వద్ద నిర్వహించారు.
తెలంగాణ బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కమిటీ వేసి ప్రాజెక్టులను సందర్శించనున్నారు టీబీజేపీ నేతలు.
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ని కీలక పదవి వరించింది. సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆయన నియమితులవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఏపీలో మోదీ జీరో అని ఎద్దేవా చేశారు. మోదీ హామీలపై, కాంగ్రెస్ హామీలపై కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి చర్చకు సిద్ధమా..? అని ఛాలెంజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో శుక్రవారం పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది.
కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ న్యూఢిల్లీలో సోమవారం సమావేశం అయ్యారు. విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జయంత్ చౌదరిని విజ్ఞప్తి చేశారు.
ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల ద్వారానే ప్రభుత్వాలకు అధిక ఆదాయం వస్తోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ భారం సామాన్య ప్రజలపై పడుతోందని పేర్కొన్నారు.
మావోయిస్టు పార్టీకి మరొక ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్‌ధేర్ రాజ్ పోలీసులకు సోమవారం లొంగిపోయారు. రామ్‌ధేర్‌తో పాటు మరో 12 మంది సాయుధ నక్సలైట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులకు లొంగిపోయారు.
గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిర్చ్ నైట్ క్లబ్‌లో సిలిండర్ పేలి 25 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. ఈ ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. భూములు అమ్మి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని విమర్శించారు.