గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్
ABN , Publish Date - Feb 05 , 2026 | 12:31 PM
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం(Central Government) శుభవార్త తెలిపింది. 15వ ఆర్థిక సంఘం(15th Finance Commission) నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదలయ్యాయి. కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ చూపి.. కేంద్ర ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపడంతో ఈ నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.
నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఈ నిధులు కొత్త ఊపిరి పోయనున్నాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడం, నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టడంతో సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. గతంలో పంచాయతీల పదవీ కాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధుల విడుదలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎన్నికైన ప్రజాప్రతినిధులు(సర్పంచ్‌లు) ఉంటేనే ఈ నిధులను నేరుగా పంచాయతీ ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. ఇటీవల ఎన్నికలు ముగియడంతో ఈ ప్రక్రియ పూర్తయింది. పంచాయతీలకు అందిన ఈ నిధులను ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా అవసరాల కోసం రాష్ట్ర సర్కార్ ఖర్చు చేయనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?
Read Latest Telangana News And AP News And Telugu News