Share News

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. కుప్పంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు ఆమోదం

ABN , Publish Date - Feb 17 , 2026 | 09:41 PM

చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుదలకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లేఖ రాశారు..

రైల్వేశాఖ కీలక నిర్ణయం..  కుప్పంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు ఆమోదం
Kuppam Railway Station

అమరావతి, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లలో (Kuppam Railway Station) రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపేజ్‌కు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లేఖ రాశారు. వాస్కోడగామా - వేలంకణి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును కుప్పం రైల్వే స్టేషన్‌లో స్టాపేజ్‌కు ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేశారు. దాదర్ సెంట్రల్ - పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలు కూడా ఇక నుంచి కుప్పం రైల్వేస్టేషన్‌లో నిలుపుదల చేసేందుకు ఆమోదించినట్లు తెలిపారు రైల్వే శాఖ మంత్రి.


ఈ నెల10 తేదీన ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి కుప్పం రైల్వే స్టేషన్‌లో ఈ ఎ‌క్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కుప్పం మీదుగా నడిచే దూరప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపేజ్ కోసం స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని గతంలో రైల్వేమంత్రికి తెలిపారు సీఎం. ఈ రెండు రైళ్ల స్టాపేజ్‌కు ఆమోదం లభించిట్లు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. కుప్పంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపేజ్‌కు అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..

వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 17 , 2026 | 09:58 PM