లోక్‌సభ స్పీకర్‌పై విపక్షాల తీరుపై.. వీడియో విడుదల చేసిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

ABN, Publish Date - Feb 12 , 2026 | 01:40 PM

విపక్షాల తీరుపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఓ వీడియో విడుదల చేశారు. ఫిబ్రవరి5వ తేదీన లోక్‌సభ స్పీకర్ కార్యాలయంలో కాంగ్రెస్ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆయన అన్నారు.

దేశ రాజకీయాల్లో మరోసారి పార్లమెంట్ వ్యవహారాలు చర్చనీయాంశమయ్యాయి. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు విపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఫిబ్రవరి 5వ తేదీన లోక్‌సభ స్పీకర్ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. 20 నుంచి 25 మంది కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ ఛాంబర్‌లోకి వెళ్లి దుర్భాషలాడారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు.


కిరణ్ రిజుజు వెల్లడించిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 5న కొందరు కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ కార్యాలయంలోకి గుంపుగా వెళ్లారని, అక్కడ వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి, తీవ్ర పదజాలంతో మాట్లాడారని ఆరోపించారు. స్పీకర్ కార్యాలయం వంటి రాజ్యాంగబద్ధమైన స్థలంలో ఇలాంటి ప్రవర్తన సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు, వాదనలు అనేవి పార్లమెంట్‌లో జరుగుతాయని, కానీ భౌతికంగా బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కిరణ్ రిజుజు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన

Read Latest Telangana News And AP News And Telugu News

Updated at - Feb 12 , 2026 | 04:34 PM