Share News

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో టీడీపీ ఎంపీ భేటీ.. పలు అంశాలపై చర్చ

ABN , Publish Date - Feb 13 , 2026 | 05:21 PM

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో టీడీపీ ఎంపీ భేటీ.. పలు అంశాలపై చర్చ
Lavu Sri Krishna Devarayalu

ఢిల్లీ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో(Gajendra Singh Shekhawat) తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు(TDP MP Lavu Sri Krishna Devarayalu) శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కొండవీడు కోట వారసత్వ అభివృద్ధి ప్రాజెక్ట్ కోసం స్వదేశ దర్శన్ స్కీమ్ 2.0 కింద నిధులను త్వరగా మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ వారసత్వ పరిరక్షణ, పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి కూడా ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొండవీడు కోట అభివృద్ధి ప్రాజెక్ట్ డీపీఆర్‌ను ఆమోదించి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై వెంటనే నిర్ణయం తీసుకుని నిధులను విడుదల చేయాలని ఎంపీ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలంటే వైసీపీ నేతలకు గౌరవం లేదు.. జగన్ అండ్ కోపై లోకేశ్ ధ్వజం

జగన్ హయాంలో మద్యనిషేధం పేరుతో రేట్లు పెంచారు: మంత్రి కొల్లు రవీంద్ర

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 05:28 PM