జగన్ హయాంలో మద్యనిషేధం పేరుతో రేట్లు పెంచారు: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Feb 13 , 2026 | 10:04 AM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కల్తీ మద్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. కల్తీ మద్యంపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి.
అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కల్తీ మద్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) సమాధానం ఇచ్చారు. కల్తీ మద్యంపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. కల్తీ మద్యానికి సంబంధించి 29 కేసులు నమోదు చేశామని తెలిపారు. కల్తీ మద్యం తరలింపునకు ఉపయోగించిన 34 వాహనాలను సీజ్ చేశామని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి తీసుకొచ్చిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై 31,081 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
కల్తీ మద్యం స్కాంపై సిట్ విచారణ..
ఈ కేసుల్లో రవాణాకు ఎన్‌డీపీఎల్ అక్రమ రవాణాకు ఉపయోగించిన 10,232 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. కల్తీ మద్యం స్కాంపై 13 ల్యాబ్‌లలో సిట్ అధికారులు పరిశీలించిన తర్వాతే విచారణ చేస్తున్నారని తెలిపారు. వైసీపీ హయాంలో ఎన్నికల ముందు సంపూర్ణ మద్యనిషేధం అని చెప్పి తర్వాత రేట్లు పెంచారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో మద్యం ధర పెంచారని.. చాలా మంది ఈ ధరలు చెల్లించలేక జంగారెడ్డిగూడెం లాంటి చోట కల్తీ మద్యం తాగి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సరఫరాను నాడు అంతా ఒక మాఫియాలా చేశారని ఆరోపించారు. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా నిందితులుగా ఉన్నారని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కల్తీ లిక్కర్ సరఫరా జరగకుండా నవోదయం పేరుతో క్యాంపెయిన్ చేస్తున్నామన్నారు.
నాడు మద్యం నిషేధమని చెప్పి..: ఎమ్మెల్యే వసంత
జగన్ హయాంలో దశలవారీ మద్యం నిషేధమని చెప్పి తుంగలో తొక్కిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఈ కేసులో ముద్దాయిల్లో విజయసాయి రెడ్డి ఒకరిగా ఉన్నారని ప్రస్తావించారు. కింగ్ పిన్, ఆయన వెనుక ఉన్న కింగ్ ఎవరో ఈ కేసులో బయటకు రావాలని చెప్పారు. రూ.3,500 కోట్ల స్కాంలో 360 రోజులయినా బెయిల్ ఇవ్వమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అన్నారు.
ఈ కేసుపై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారని.. ఈ స్కాంలో రూ.3500 కోట్లు కుంభకోణం జరిగినట్లుగా తెలుస్తోందన్నారు. మద్యం ధర పెంచితే తాగరనే సాకుతో నాణ్యమైన మద్యాన్ని మందుబాబుల నుంచి దూరం చేశారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యాన్ని రూ.99లకే అందిస్తోందని చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో తప్పు చేశారని.. నాటి ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధమైన విధానం మంచిది కాదని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం, చర్చలు
ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడి చర్చ
Read Latest Telangana News And AP News And Telugu News