Share News

ఏసీబీ రైడ్స్.. సచివాలయ అడ్మిన్ గుట్టు రట్టు

ABN , Publish Date - Feb 03 , 2026 | 06:45 AM

విశాఖపట్నం నగరంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఓ సచివాలయ ఉద్యోగి.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

ఏసీబీ రైడ్స్.. సచివాలయ అడ్మిన్ గుట్టు రట్టు
ACB Raids

విశాఖపట్నం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లాలో ఏసీబీ అధికారులు(Anti Corruption Bureau) దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో 74వ వార్డు నెహ్రూనగర్ సచివాలయ అడ్మిన్‌ గణేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఇంటి పన్ను(Property Tax), కుళాయి పన్ను(Water Tax) సంబంధిత పేరు మార్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది.


ఏం జరిగిందంటే.?

నెహ్రూనగర్‌కు చెందిన పల్లా సత్తిబాబు అనే వ్యక్తి.. ఇంటి పన్ను, కుళాయి పన్ను తన పేరు నుంచి భార్య పేరిట మార్పించేందుకు సచివాలయాన్ని ఆశ్రయించాడు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగాల్సిన సాధారణ ప్రక్రియ. అయినప్పటికీ అడ్మిన్ గణేశ్.. ఈ పని పూర్తిచేసేందుకు రూ.25,000లు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు వెల్లడించాడు.


మరో రూ. 16 వేల కోసం ఒత్తిడి..

బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. గణేశ్ ఇప్పటికే రూ.9,000లు లంచంగా తీసుకున్నాడు. అయితే పని ఇంకా పూర్తవలేదని, మిగిలిన రూ.16,000లు ఇస్తే గానీ ఫైల్ ముందుకు కదలదని గణేశ్ స్పష్టంగా చెప్పినట్లు సత్తి బాబు వెల్లడించాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన గణేశ్.. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజల అవసరాలను లంచంగా మార్చాడని బాధితుడు మండిపడ్డాడు.


ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు..

ఆ సొమ్మును ఇచ్చుకోలేని పరిస్థితుల్లో పల్లా సత్తిబాబు నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించి.. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ ఆపరేషన్ నిర్వహించారు. బాధితుడికి తగిన సూచనలు ఇచ్చి.. రూ.16,000ల ట్రాప్ మనీతో సచివాలయానికి పంపారు. గణేశ్ లంచం తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఈ సోదాలో గణేశ్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. వెంటనే ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. గణేశ్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేరమయ రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం.. జగన్ అండ్ కోపై సీఎం చంద్రబాబు ఫైర్

మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌పై కేసు నమోదు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 07:44 AM