DMK MP Kanimozhi: బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా.. కనిమొళి మద్దతు
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:43 PM
బీసీ రిజర్వేషన్లు 42 శాతం కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు బుధవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు డీఎంకే ఎంపీ కనిమొళి మద్దతు తెలిపారు. రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలని కనిమొళి డిమాండ్ చేశారు.
ఢిల్లీ,ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లు 42శాతం కేంద్రప్రభుత్వం అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు ఇవాళ( బుధవారం) జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు డీఎంకే ఎంపీ కనిమొళి (DMK MP Kanimozhi) మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ వేదికగా కనిమొళి మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. తరతరాలుగా వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళినాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని ఉద్ఘాటించారు డీఎంకే ఎంపీ కనిమొళి.
పెరియార్ కాలం నుంచి రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ ఉందని గుర్తుచేశారు. దేశంలో పోరాటం చేసి రిజర్వేషన్లు పెంచుకున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు అని నొక్కిచెప్పారు. బీసీ రిజర్వేషన్లు పెంపునకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు డీఎంకే పూర్తి మద్దతు ఇస్తోందని ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అన్ని స్థాయిల్లో మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంటులో కూడా ఈ అంశంపై తెలంగాణ ఎంపీలు చేసే పోరాటానికి డీఎంకే మద్దతు ఉంటుందని ఎంపీ కనిమొళి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కామారెడ్డి డిక్లరేషన్‌పై కాంగ్రెస్ మాట తప్పింది: బండి సంజయ్
చట్టవిరుద్ధ యాప్‌లకు ప్రమోషన్ ఎందుకు.. విజయ్ దేవరకొండపై ఈడీ ప్రశ్నల వర్షం
Read latest Telangana News And Telugu News