Home » Kanimozhi
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. బలమైన రాజకీయ శక్తిగా ఉన్న డీఎంకే, కాంగ్రెస్ పార్టీతో తమకున్న పొత్తు ముగిసిందని అధికారికంగా ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..
డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల అగ్రనేతలు దశాబ్దాల వైరాన్ని మరిచి పొత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు.
అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టారంటూ కొంతమంది చేస్తున్న విమర్శలను డీఎంకే నాయకురాలు కనిమొళి కొట్టిపారేశా రు. వారి మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డీఎంకే తరుపున రూపుదిద్దుకోనున్న మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకునేలా ఉంటుందని ఎంపీ కనిమొళి అన్నారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు, మహిళలకు హక్కులు, అన్నదాతలకు భద్రత వంటి అంశాలపై మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు.
అన్నాడీఎంకే కార్యాలయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఢిల్లీకి మార్చారంటూ ఎద్దేవా చేసిన డీఎంకే లోక్‌సభ సభ్యురాలు కనిమొళికి ఆయన కౌంటర్ ఇచ్చారు.
బీసీ రిజర్వేషన్లు 42 శాతం కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు బుధవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు డీఎంకే ఎంపీ కనిమొళి మద్దతు తెలిపారు. రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలని కనిమొళి డిమాండ్ చేశారు.
మదురైలో మురుగన్ మహానాడు నిర్వహించడం వల్ల రాష్ట్రంలో బీజేపీ పరపతి పెరిగే అవకాశమే లేదని డీఎంకే ఎంపీ కనిమొళి ఎద్దేవా చేశారు. కన్నియాకుమారిలో బుధవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ డీఎంకే కూటమి మరింత పటిష్టంగానే ఉందని మిత్రపక్షాల్లో కొన్ని పార్టీలు కూటమి నుండి వైదొలగుతాయని బీజేపీ, అన్నాడీఎంకే నేతలు చేస్తున్న ప్రకటనలు అవాస్తవాలన్నారు.
డీఎంకే ఎంపీ కనిమొళి సారథ్యంలోని ప్రతినిధుల బృందం స్పెయిన్‌లో పర్యటిస్తోంది. భారతదేశ అధికార భాషపై ఈ సందర్భంగా మాడ్రిడ్‌లో ఎన్అర్ఐలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కనిమొళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
డీెఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభాగం కేంద్ర ప్రభుత్వ శాఖగా పనిచేస్తోందంటూ ఆమె విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీశాయి.
ధర్మేంద్ర ప్రధాన్‌పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు ఇస్తూ, ఎన్‌ఈపీపై డీఎంకే ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. స్కూల్ ఎడ్యుకేషన్‌కు నిధులను ఎన్‌ఈపీ అమలుతో కేంద్రం ముడిపెట్టరాదని, ఈ విషయంలో తమ (డీఎంకే) వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.