Share News

DMK MP Kanimozhi: రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:53 PM

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డీఎంకే తరుపున రూపుదిద్దుకోనున్న మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకునేలా ఉంటుందని ఎంపీ కనిమొళి అన్నారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు, మహిళలకు హక్కులు, అన్నదాతలకు భద్రత వంటి అంశాలపై మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు.

DMK MP Kanimozhi: రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన

- డీఎంకే ఎంపీ కనిమొళి

చెన్నై: రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్‌ కమిటీ చైర్మన్‌ ఎంపీ కనిమొళి(MP Kanimozhi) పేర్కొన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార డీఎంకే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రప్రజలను మళ్లీ ఆకట్టుకునేలా మానిఫెస్టో తయారుచేసే బాధ్యతలను ఎంపీ కనిమొళి నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. ఇందులో పలు రంగాల్లో రాణించిన విద్యావేత్త, మాజీ ఐఏఎస్‌ అధికారి, ఒక వైద్యుడు, పారిశ్రామిక వేత్త, ఆర్థిక నిపుణులతో కూడిన కమిటీని పార్టీ అధిష్టానం నియమించింది.


వీరితో పాటు రాష్ట్రమంత్రులు పీటీఆర్‌.పళనివేల్‌ త్యాగరాజన్‌, టీఆర్‌బీ రాజా, ఉన్నత విద్యాశాఖ మంత్రి కేవీ.చెళియన్‌, మాజీ ఎంపీలు టీకేఎస్‌ ఇళంగోవన్‌, రవీంద్రన్‌, కార్తికేయ శివసేనాధిపతి, ఎంఎం.అబ్దుల్లా, డీఎంకే మహిళా విభాగం ఉపకార్యదర్శి, ఎమ్మెల్యే తమిళరసి, డాక్టర్‌ ఎలీలన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సంతానం వంటి నిపుణులను కూడా ఈ కమిటీలో చేర్చారు. గతంలో జరిగిన ఎన్నికల్లో డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోకు ప్రజల మద్దతు పెరిగినట్లే ఈసారి జరగనున్న ఎన్నికల్లో కూడా ప్రజలను ఆకట్టుకునేలా,


రాబోయే ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్లే మార్గదర్శకాలతో ఎన్నికల మేనిఫెస్టో వుండాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఈ కమిటీని ఆదేశించారు. ఆ మేరకు సోమవారం ఉదయం తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నాఅరివాలయంలో ఎన్నికల మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం ఎంపీ కనిమొళి అధ్యక్షతన జరిగింది.


nani2.2.jpg

ఈ సమావేశం అనంతరం కనిమొళి మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డీఎంకే తరుఫున రూపుదిద్దుకోనున్న మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకునేలా ఉంటుందని, ముఖ్యంగా రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు, మహిళలకు హక్కులు, అన్నదాతలకు భద్రత, రాష్ట్ర హక్కుల కోసం ఉద్యమించడం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ మేనిఫెస్టోను తయారు చేయనున్నట్లు ఆమె తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇచ్చంపల్లి నుంచి తరలిస్తే మహారాష్ట్రకు ముంపు!

ఈశాన్య రుతుపవనాలు బలహీనం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 23 , 2025 | 01:53 PM