Share News

కాంగ్రెస్‌కు డీఎంకే షాక్.. లోక్‌సభ స్పీకర్‌కు కనిమొళి కీలక లేఖ

ABN , Publish Date - May 08 , 2026 | 03:00 PM

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. బలమైన రాజకీయ శక్తిగా ఉన్న డీఎంకే, కాంగ్రెస్ పార్టీతో తమకున్న పొత్తు ముగిసిందని అధికారికంగా ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

కాంగ్రెస్‌కు డీఎంకే షాక్.. లోక్‌సభ స్పీకర్‌కు కనిమొళి కీలక లేఖ
DMK Congress Alliance

న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. బలమైన రాజకీయ శక్తిగా ఉన్న డీఎంకే, కాంగ్రెస్ పార్టీతో తమకున్న పొత్తు ముగిసిందని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు డీఎంకే ఎంపీ కనిమొళి ఢిల్లీలో కీలక ప్రకటన చేశారు. దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు, సమీకరణాల దృష్ట్యా ఇకపై కాంగ్రెస్‌తో కలిసి నడవలేమని ఆమె స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే పార్లమెంటరీ కార్యకలాపాల పరంగా కూడా డీఎంకే కీలక అడుగు వేసింది. లోక్‌సభలో తమ పార్టీ ఎంపీలకు ప్రత్యేక సీటింగ్ కేటాయించాలని కోరుతూ కనిమొళి స్పీకర్‌కు లేఖ రాశారు.


ఇప్పటి వరకు సభలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చున్న డీఎంకే సభ్యులు.. ప్రస్తుత పరిస్థితుల్లో వారితో కలిసి కూర్చోలేమని స్పష్టంగా పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీలందరికీ సభలో వేర్వేరుగా సీట్లు కేటాయించి, స్వతంత్రతను గౌరవించాలని ఆమె స్పీకర్‌ను విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు ముగియడం అనేది కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండా, పార్లమెంట్ లోపల కూడా ప్రతిబింబించాలని డీఎంకే భావిస్తోంది. ఈ పరిణామం అటు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోనూ, ఇటు కేంద్రంలోని విపక్ష కూటముల్లోనూ పెను సంచలనంగా మారింది.


ఈ వార్తలనూ చదవండి:

పొత్తు నుంచి బయటకు రావడం సరైనదే.. ద్రోహి ఎవరు?: ఎంపీ మాణికం ఠాగూర్

అన్నాడీఎంకేతో డీఎంకే పొత్తు.. కనిమొళి ఏమన్నారంటే..

Updated Date - May 08 , 2026 | 03:25 PM