Share News

వారి మేనిఫెస్టోను మేమెందుకు కాపీకొడతాం ?

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:14 PM

అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టారంటూ కొంతమంది చేస్తున్న విమర్శలను డీఎంకే నాయకురాలు కనిమొళి కొట్టిపారేశా రు. వారి మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు.

వారి మేనిఫెస్టోను మేమెందుకు కాపీకొడతాం ?

  • ఆదాయపన్ను చెల్లించని మహిళలకే రూ.8వేల కూపను

  • డీఎంకే నాయకురాలు కనిమొళి

చెన్నై: అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టారంటూ కొంతమంది చేస్తున్న విమర్శలను డీఎంకే నాయకురాలు కనిమొళి కొట్టిపారేశా రు. వారి మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు. డీఎంకే గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 505 హామీల్లో తాము ఇప్పటికే 404 హామీలను నెరవేర్చామని గుర్తు చేశారు. సోమవారం ఆమె డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయంలో మీడియా తో మాట్లాడుతూ.. డీఎంకే ప్రారంభించిన పలు పథకాలను అన్నాడీఎంకే కాపీ చేసిందని ఎద్దేవా చేశారు.


డీఎంకే గత ఎన్నికల మేనిఫెస్టో మాదిరిగానే, ఈ మేనిఫెస్టో కూడా దేశం మొత్తానికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ప్రజా భిప్రాయాలను సేకరించిన తర్వాత తాము ఈ మేనిఫెస్టో రూపొందించామన్నారు. గృహిణులకు రూ.8,000కూపన్లను పంపిణీ చేయడానికి అనుసరించే ప్రమాణాలకు సంబంధించిన ప్రశ్నకు కనిమొళి సమాధానమిస్తూ..


zzzz.jpgఇన్‌కంటాక్స్‌ చెల్లించని మహిళలకు మాత్రమే రూ.8వేల విలువైన కూప న్లు అందజేస్తామన్నారు. అనేక కుటుంబాల వద్ద ఇప్పటికే రిఫ్రిజిరేటర్‌ వంటి గృహోపకరణాలున్నాయని, అయినప్పటికీ లబ్దిదారులు తమకు అవసరమైన నిర్దిష్ట వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ కూపన్లను వినియోగించుకోవచ్చని కనిమొళి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..

రేపటి నుంచే మార్పులు.. మీ పాకెట్ పై ప్రభావం చూపించే అంశాలు!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 31 , 2026 | 01:14 PM