Share News

అదృష్టం కోసం ఏ కలర్ బ్యాగ్ వాడాలో తెలుసా?

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:42 PM

వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఉపయోగించే పర్సు లేదా బ్యాగ్ కలర్ కూడా మన ఆర్థిక స్థితి, అదృష్టంపై ప్రభావం చూపుతుందని అంటారు. మరి అదృష్టం కోసం ఏ కలర్ బ్యాగ్ లేదా పర్సు వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అదృష్టం కోసం ఏ కలర్ బ్యాగ్ వాడాలో తెలుసా?
Vastu Tips For Wallet Color

ఇంటర్నెట్ డెస్క్: వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఉపయోగించే వస్తువుల రంగులు మన జీవితంపై ప్రభావం చూపుతాయని అంటారు. ముఖ్యంగా పర్సు లేదా బ్యాగ్ కలర్ మన ఖర్చులు, ఆదాయం, విజయంపై ప్రభావం చూపుతుందని చెబుతారు.


బ్లాక్ కలర్ బ్యాగ్

నలుపు శక్తి, రక్షణకు సూచిక. ఇది ఖర్చులను నియంత్రించడంలో సహాయపడుతుంది.

వైట్ కలర్ బ్యాగ్

తెలుపు శాంతి, సమతుల్యతకు సంకేతం. అనవసర ఖర్చులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

బ్రౌన్ కలర్ బ్యాగ్

బ్రౌన్ కలర్ భూమికి సంబంధించిన రంగు. ఆదాయం స్థిరంగా ఉండేందుకు సహాయపడుతుంది.


ఆరెంజ్ కలర్ బ్యాగ్

ఆరెంజ్ కలర్ బ్యాగ్.. సృజనాత్మకతను పెంచుతుంది. క్రియేటివ్ రంగాల్లో పనిచేసేవారికి ఈ కలర్ బ్యాగ్ మంచిది.

గోల్డ్, సిల్వర్ కలర్ బ్యాగ్

గోల్డ్ కలర్ బ్యాగ్.. కీర్తి, ప్రతిష్టను పెంచుతుంది. సిల్వర్ కలర్ సామాజిక గుర్తింపును పెంచుతుంది.

బ్లూ, గ్రీన్ కలర్ బ్యాగ్

బ్లూ కలర్ నిర్ణయాలు తీసుకునే శక్తిని పెంచుతుంది. గ్రీన్ కలర్.. ఎదుగుదలతో ముడిపడి ఉంటుంది.

రెడ్, ఎల్లో కలర్ బ్యాగ్

ఎరుపు ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని పెంచుతుంది. పసుపు రంగు.. సంపద, విజయానికి అత్యంత శుభప్రదంగా భావిస్తారు.


అదృష్టం కోసం..

అదృష్టం, ఆర్థిక వృద్ధి కోసం ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, గోధుమ రంగుల పర్సులు/బ్యాగులు మంచివి. వాస్తు ప్రకారం ఎరుపు/గోధుమ రంగులు డబ్బును ఆకర్షించగా, ఆకుపచ్చ వృద్ధిని, నలుపు స్థిరత్వాన్ని సూచిస్తాయి. ఆయా రోజుల గ్రహ స్థితులను బట్టి రంగులను ఎంచుకోవడం వల్ల సానుకూల ఫలితాలు పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Latest News

Updated Date - Mar 31 , 2026 | 12:57 PM