Share News

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

ABN , Publish Date - Mar 23 , 2026 | 08:09 AM

రాత్రి నిద్ర పోయే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని పాలు తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. అలా తాగడం వల్ల నిద్ర బాగా పడుతుందని చెబుతారు.

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
Nutmeg Milk

రాత్రి నిద్ర పోయే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని పాలు తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. అలా తాగడం వల్ల నిద్ర బాగా పడుతుందని చెబుతారు. అయితే ఇందులో కాస్తా జాజికాయ పొడి వేసుకుని తాగడం వల్ల మరిన్ని మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియకు సైతం సహాయపడుతుందని పేర్కొంటున్నారు. జాజికాయ కలిపిన పాలలో ప్రశాంతతను కలిగించే గుణాలు ఉన్నాయంటారు. అంతేకాకుండా ఈ పాలను గోరు వెచ్చగా తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం సైతం కలిగిస్తుందని చెబుతున్నారు.


ఈ జాజికాయలోని నొప్పి నివారణ గుణాలు రాత్రి సమయంలో అవసరమైన విశ్రాంతిని అందిస్తుందంటున్నారు. ఈ జాజికాయ పొడిని పాలలో చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలని సూచిస్తున్నారు. అధిక పరిమాణంలో తీసుకుంటే విషపూరితం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదీకాక జాజికాయ నూనె 25 రకాల బ్యాక్టీరియాలతో పోరాడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైనట్లు గుర్తు చేస్తున్నారు. ఒక టేబుల్ స్పూన్ లేదా ఏడు గ్రాముల జాజికాయ పొడిలో 36.8 కిలో కేలరీల శక్తి ఉంటుందని చెబుతున్నారు.


జాజికాయ పొడి కలిపిన పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

నిద్రను మెరుగుపరుస్తుంది..

జాజికాయలో మైరిస్టిసిన్ అనే పదార్థం ఉంటుంది. దీనిలో శాంతి పరిచే ప్రభావం ఉంటుందని అధ్యయనంలో తేలింది. జాజికాయ పాలను తీసుకోవడం వల్ల నిద్ర కలిగించే గుణాలు ఉంటాయంటారు. అందువల్ల ఇది నిద్రలేమికి ఒక సమర్థవంతమైన చికిత్సగా పని చేస్తుందని చెబుతారు.


ఆందోళన నుంచి ఉపశమనం..

జాజికాయను పాలలో కలిపి తీసుకున్నప్పుడు.. అది సెరోటోనిన్ అనే హార్మోన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది. తద్వారా ఈ హార్మోన్ సంతోష భావనను కలిగిస్తుది. ఇది మీకు చాలా ప్రశాంతమైన మానసిక స్థితిని ఇస్తుంది.


వాపును నియంత్రిస్తుంది..

జాజికాయలో మోనోటెర్పెన్లు, ఫ్లేవనాయిడ్లు తదితర సమ్మేళనాలు ఉంటాయి. అలాగే దీనిలో సయానిడిన్లు, ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. వీటికి శోథ నిరోధక గుణాలు సైతం ఉంటాయి.


జీర్ణక్రియకు సహాయపడుతుంది..

జీర్ణక్రియకు జాజికాయ సహాయపడుతుంది. దీనిలోని సారం.. జీర్ణాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్ణం, విరేచనాలు వంటి జీర్ణాశయ సమస్యలకు జాజికాయను మంచి ఔషధంగా వినియోగిస్తారు.


యాంటీఆక్సిడెంట్ ప్రభావం..

జాజికాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఒత్తిడి నుంచి కాపాడతాయి. అంతేకాకుండా ఈ యాంటీఆక్సిడెంట్లు కణ నష్టాన్ని నివారిస్తాయి. దీర్ఘాకాల వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.


గుండె ఆరోగ్యానికి..

జాజికాయలోని సమ్మేళనాలు లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ జాజికాయాలో పొటాషియం ఉంటుంది. ఇది గుండె స్పందన రేటుతోపాటు రక్తపోటును సైతం నియంత్రించడంలో సహాయ పడుతుంది.

Updated Date - Mar 23 , 2026 | 08:30 AM