బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:33 AM
బీహార్‌లోని నలందలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నలందలో ఒక ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది.
బీహార్‌లోని నలందలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది (Bihar temple stampede). నలందలో ఒక ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. నలంద జిల్లాలోని శీతలా మాత ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. అందరూ మహిళలే కావడం గమనార్హం. 12 మందికి పైగా గాయపడ్డారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది.
నలంద జిల్లాలోని బీహార్ షరీఫ్‌కు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మఘ్రా గ్రామంలోని శీతలాష్టమి ఆలయం వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. చైత్ర మాసంలోని చివరి మంగళవారం కావడంతో, ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అధిక సంఖ్యలో మహిళలు మంగళవారం నాడు ఈ గుడికి వస్తుంటారు. నిర్వహణ లోపం కారణంగానే ఈ తొక్కిసలాట జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పదుల సంఖ్యలో మహిళలు స్పృహ తప్పిపోడిపోయిన దృశ్యాలు కలవరపెడుతున్నాయి. బాగా రద్దీగా ఉండడంతో అంబులెన్స్‌లు కూడా అక్కడకు చేరుకోవడం ఇబ్బందిగా మారింది. గాయపడిన వారికి స్థానికులు సపర్యలు చేస్తున్నారు. చేతులతో ఎత్తుకుని అంబులెన్స్‌ల వద్దకు తీసుకెళ్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పాక్ మధ్యవర్తిత్వం అక్కర్లేదు.. తిరస్కరించిన ఇరాన్..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..