Home » CM Revanth Reddy
ఓట్లు, పార్టీలు, నిధులు, ఎన్నికల గుర్తుల దొంగతనం దేశంలో జరుగుతోందని, యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కేరళ ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డును తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రదానం చేశారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ అవార్డును సీఎంకు అందజేశారు.
వరంగల్ జిల్లా మామునూరు, ఆదిలాబాద్ జిల్లాలోని విమానాశ్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లను ఖరారు చేసింది. మామునూరు ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమ, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు కొమురంభీం పేర్లను దాదాపు ఖరారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా విద్యుత్తును కొనుగోలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎత్తిపోతల పథకాలకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని స్పష్టం చేశారు.
జూరాల ఆయకట్టు రైతుల నీటి కష్టాలకు ఉపశమనం లభించనుంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి పది రోజుల పాటు వారాబందీ(ఆన్ అండ్ ఆఫ్) విధానంలో నీళ్లు ఇవ్వడానికి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంగీకరించారు.
తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదలకు కర్ణాటక సర్కార్ అంగీకారం తెలిపింది. అల్మట్టి నుంచి మూడు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారు.
ది ప్యారడైజ్ సినిమాకు సంబంధించి నేచరల్ స్టార్ నాని చేసిన ప్రత్యేక విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవించినందుకు నానికి అభినందనలు తెలియజేశారు.
దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సొంత తల్లిలా ప్రేమ చూపించిన ఇందిరమ్మను వారు ఇప్పటికీ మరిచిపోలేదన్నారు.
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
హైదరాబాద్ తరహాలో అన్ని రంగాల్లో వరంగల్ అభివృద్ధి సాధిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.