CM Revanth On Tank Bund: ట్యాంక్‌బండ్‌కు సీఎం రేవంత్.. గణేశ్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:34 PM
హైదరాబాద్‌లో ఇవాళ వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
హైదరాబాద్: నగర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్ వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జనాల వేడుకను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్వయంగా ట్యాంక్‌బండ్‌కు సీఎం వచ్చినట్లు సమాచారం. నిమజ్జనాల నేపథ్యంలో అధికారులు చేసిన భద్రత ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. అనంతరం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సాధారణ వ్యక్తిగా ట్యాంక్ బండ్ వద్దకు వచ్చి నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించారు. రేవంత్ రెడ్డి రావడంతో భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రజలకు అభివాదం చేస్తూ.. ముందుకు కదిలారు. అత్యంత తక్కువ సంఖ్యలో భద్రత సిబ్బందితో.. మూడు కార్ల ఎస్కార్ట్‌తో సీఎం ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. నిమజ్జనం జరుగుతున్న తీరును అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. గణేశ్ నిమజ్జనాల సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. వినాయక నిర్వాహకులు, ప్రజలు అధికారులకు సహకరించాలని సీఎం స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
సీఎం కారుకు జరిమానా.. డిస్కౌంట్‌తో చెల్లింపు
ఆపరేషన్ సిందూర్ ముగియలేదు... ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు