Siddaramaiah Car Fined: సీఎం కారుకు జరిమానా.. డిస్కౌంట్‌తో చెల్లింపు
ABN , Publish Date - Sep 06 , 2025 | 02:47 PM
ఆరు వేర్వేరు సందర్భాల్లో సిద్ధరామయ్య ప్రభుత్వ కారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు కథనాలు వచ్చాయి. తాజాగా బెంగళూరులో ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కెమెరాల్లో సీఎం ఫ్రంట్ సీటులో సీటుబెల్ట్ పెట్టుకోకుండా కూర్చున్నట్టు రికార్డయింది.
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రయాణించే కారుకు సైతం చలానాలు తప్పలేదు. 2024 నుంచి సిటీ జంక్షన్ల వద్ద పలుమార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు కెమెరాలలో రికార్డయింది. దీంతో సిద్ధరామయ్య ఆ బకాయిలు చెల్లించారు. 50 శాతం డిస్కౌంట్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ఆ రాయితీని ఉపయోగించుకుని సీఎం జరిమానాలు కట్టారు.
ఆరు వేర్వేరు సందర్భాల్లో సిద్ధరామయ్య ప్రభుత్వ కారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు కథనాలు వచ్చాయి. తాజాగా బెంగళూరులో ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజిమెంట్ సిస్టమ్ (ITMS) కెమెరాల్లో సీఎం ఫ్రంట్ సీటులో సీటుబెల్ట్ పెట్టుకోకుండా కూర్చున్నట్టు రికార్డయింది. మరో కేసులో ఆయన వాహనం కెంపెగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్స్‌ప్రెస్ కారిడార్ మీదుగా వేగంగా వెళ్తుండటం రికార్డయింది. గత జనవరి, ఫిబ్రవరి, ఆగస్టుల్లో కూడా సీట్‌బెల్ట్ ఉల్లంఘన కేసులు రికార్డయ్యాయి. ఆరుసార్లు నిబంధనల ఉల్లంఘనలకు రూ.5,000 జరిమానా పడింది.
సీఎం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో సిద్ధరామయ్య బకాయిలు చెల్లించినట్టు ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. రిబేట్ స్కీమ్ కింద రూ.2,500 చెల్లించినట్టు వివరించారు.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్ సిందూర్ ముగియలేదు... ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఎర్రకోట వద్ద భారీ చోరీ.. కోట్ల విలువైన బంగారు వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగ
For More National News And Telugu News