Share News

Upendra Dwivedi On Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు... ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 06 , 2025 | 02:05 PM

భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల ఆపరేషన్ సిందూర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

Upendra Dwivedi On Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు... ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Upendra Dwivedi On Operation Sindoor

ఇంటర్నెట్ డెస్క్: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల ఆపరేషన్ సిందూర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అందరూ అనుకుంటున్నట్లు ఆపరేషన్ సిందూ‌ర్ మే 10వ తేదీన ముగియలేదన్నారు. అధికారికంగా ఆ రోజున కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. ఆపరేషన్ సిందూర్ మరికొంతకాలం కొనసాగిందన్నారు.


ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ.. పాక్‌తో మే 10న యుద్ధం ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున ఈ ఆపరేషన్ మరింత కాలం కొనసాగిందని తెలిపారు. పాక్‌తో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ స్పష్టమైన వ్యూహాలతో ముందుకు వెళ్లిందని ఆయన పేర్కొన్నారు.


కాగా, ఆపరేషన్ సిందూర్‌ పేరిట భారత సైన్యం.. పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టు పెట్టిన సంగతి తెలిసిందే. భారత త్రివిద దళాలు సమన్వయంతో భారీ స్థాయిలో ఆపరేషన్‌ నిర్వహించి పాక్‌లోని ఉగ్ర స్థావరాలను చిన్నాభిన్నం చేశాయి. ఈ దాడి తరువాత చోటు చేసుకున్న పరిణామాలను సైతం భారత్ ఎంతో వ్యూహాత్మకంగా ఎదుర్కొంది. పాక్ చేసిన డ్రోన్ దాడులు, క్షిపణి దాడులను తిప్పికొట్టింది. అదే సమయంలో మిస్సైల్స్‌ను ప్రయోగించి పాక్‌పై విరుచుకుపడింది. ఇండియన్ ఫోర్సెస్ దెబ్బకు విలవిల్లాడిన పాక్.. అమెరికా సహాయంతో ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపేయాలని వేడుకుంది. దాంతో భారత్ కూడా సంయమనం పాటిస్తూ కాల్పుల విరమణకు (సీజ్ ఫైర్‌) అంగీకరించింది.


Also Read:

సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌సూద్‌కు అస్వస్థత..

క్యాన్సర్ నుంచి డయాబెటిస్ వరకు.. మందులపై జీఎస్టీ తగ్గింపు వల్ల లాభపడే వారు వీరే!

For More Latest News

Updated Date - Sep 06 , 2025 | 04:33 PM