Home » Operation Sindoor
ట్రంప్ మళ్లీ పాత పాట అందుకున్నారు. తాను భారత్, పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానని చెప్పుకొచ్చారు. 10 మిలియన్ ప్రాణాలు లేదా అంతకంటే ఎక్కువ రక్షించానని పాక్ ప్రధాని తనకు కితాబిచ్చారని చెప్పుకొచ్చారు..
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తమకు దైవిక సాయం అందిందని పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అన్నారు. తాము ఆ అనుభూతిని చెందామని చెప్పుకొచ్చారు. పాక్ చిన్నారుల రక్తం చిందడానికి అఫ్గానిస్థాన్ కారణమని నిందించారు. పాక్ కావాలో, ఉగ్ర సంస్థ టీటీపీ కావాలో తేల్చుకోవాలని తాలిబన్లకు తేల్చి చెప్పారు.
ఆపరేషన్ సిందూర్‌పై తన కామెంట్స్ దుమారం రేపుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ స్పందించారు. తను తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
ఆపరేషన్ సిందూర్‌పై భారత త్రివిధ దళాధిపతి అనిల్ చౌహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. సైన్యం ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
ఎల్ఓసీ వెంబడి పలు లాంచింగ్ ప్యాడ్లు, ఫార్వార్డ్ లొకేషన్లను ధ్వంసం చేశామని, అయితే కొన్ని యథాతథంగా ఉన్నాయని బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ చెప్పారు
భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్ధాన్ని చైనా తెలివిగా ఉపయోగించుకుంది. పాకిస్థాన్‌కు పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చింది. ఓ వైపు ఆదాయం పొందటంతో పాటు మరో వైపు ఆయుధాల ట్రైల్స్ పూర్తి చేసింది.
నేడు యుద్ధం అంటూ వస్తే ఎన్ని గంటలు జరుగుతుందో చెప్పలేమని, 'ఆపరేషన్ సిందూర్' 88 గంటలపాటు సాగించామని, వచ్చేసారి నాలుగు నెలలైనా కావచ్చు లేదా నాలుగేళ్లూ పట్టవచ్చని జనరల్ ద్వివేది అన్నారు.
బిహార్ ఎన్నికల తరువాత కూడా తమకు ఇతర పార్టీలతో పొత్తులు ఉండవని జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ అన్నారు. అయితే, ప్రస్తుత పార్టీలకు మెరుగైన ప్రత్యామ్నాయంగా ప్రజలు తమను చూస్తున్నారని కామెంట్ చేశారు.
ఈ సారి మామూలుగా ఉండదు. ఊచకోతే.. అని పాకిస్థాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు భారత వెస్ట్రన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్. పాకిస్థాన్ మళ్లీ పహల్గాం లాంటి ఉగ్రవాద దాడులు చేపట్టే అవకాశం ఉందని..
బికనీర్ మిలటరీ స్టేషన్‌తో సహా పలు ఫార్వార్డ్ ఏరియాల్లో శుక్రవారం నాడు ఉపేంద్ర ద్వివేది పర్యటించారు. బలగాల సన్నద్ధతను అంచనా వేసేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.