Operation Sindoor news: ఆపరేషన్ సిందూర్ సమయంలో బంకర్‌లోకి వెళ్లి దాక్కోమన్నారు: పాక్ అధ్యక్షుడు
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:33 PM
ఆపరేషన్ సిందూర్ పాక్ నాయకత్వానికి తీవ్ర ఆందోళన కలిగించిందనే విషయం తాజాగా బయటకు వచ్చింది. మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తాజాగా మాట్లాడారు. శనివారం జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో జర్దారీ మాట్లాడారు.
ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారతదేశం ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పాక్ నాయకత్వానికి తీవ్ర ఆందోళన కలిగించిందనే విషయం తాజాగా బయటకు వచ్చింది. మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తాజాగా మాట్లాడారు. శనివారం జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో జర్దారీ మాట్లాడారు (Asif Ali Zardari statement).
భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన నేపథ్యంలో బంకర్‌లోకి వెళ్లి దాక్కోవాలని సైన్యం తనకు సూచించిన మాట వాస్తవమేనని జర్దారీ అంగీకరించారు. 'ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ దాడులు చేస్తోంది. యుద్ధం ప్రారంభమైంది. బంకర్‌లోకి వెళదాం అని మిలిటరీ సెక్రటరీ నా దగ్గరకు వచ్చి చెప్పారు' అని జర్దారీ బహిరంగ సభలో మాట్లాడుతూ వెల్లడించారు. అయితే మిలిటరీ సెక్రటరీ సలహాను తాను తిరస్కరించానని జర్దారీ తెలిపారు (Pakistan President bunker).
మే 7వ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది (India Pakistan tensions). పాకిస్థాన్ , పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. ఆ తర్వాత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సరిహద్దులో పాక్ కాల్పులను తీవ్రతరం చేసింది. భారతదేశం నియంత్రణ రేఖ వెంబడి గట్టిగా ప్రతిస్పందించింది. ఈ పరిస్థితి యుద్ధంగా మారుతుందనే భయాలను పెంచింది. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
ఇవి కూడా చదవండి..
ఇది రైలా లేక మిసైలా.. గంటకు 700 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ రైలు గురించి తెలుసా..
వైద్య ప్రపంచంలోనే అద్భుతం.. పాదం మీద చెవి పెట్టి కాపాడారు..