China high speed train: ఇది రైలా లేక మిసైలా.. గంటకు 700 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ రైలు గురించి తెలుసా..
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:07 PM
తాజాగా చైనా రూపొందించిన హై-స్పీడ్ రైలు రవాణా ప్రపంచంలో చరిత్ర సృష్టించింది. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ పరిశోధకులు ఉపయోగించిన టెక్నాలజీతో టన్ను బరువున్న రైలు కేవలం రెండు సెకెన్ల వ్యవధిలో 700 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు
తన సృజనాత్మకతతో, ఆద్భుత ఆవిష్కరణలతో రోజు రోజుకూ కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న దేశం చైనా. మౌలిక సదుపాయాల నుంచి సైన్స్, టెక్నాలజీ వరకు చైనా గణనీయమైన పురోగతి సాధిస్తోంది. తాజాగా చైనా రూపొందించిన హై-స్పీడ్ రైలు రవాణా ప్రపంచంలో చరిత్ర సృష్టించింది. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ పరిశోధకులు ఉపయోగించిన టెక్నాలజీతో టన్ను బరువున్న రైలు కేవలం రెండు సెకెన్ల వ్యవధిలో 700 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు (maglev train technology).
400 మీటర్ల పొడవైన మాగ్నెటిక్ లెవిటేషన్ (magnetic levitation train) టెస్ట్ ట్రాక్‌పై చేసిన పరీక్ష విజయవంతమైంది. అత్యంత వేగవంతమైన సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్ టెక్నాలజీతో ఈ అద్భుతం సాధ్యమైంది. ఈ విజయం సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్ టెక్నాలజీ రంగంలో సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించింది. మాగ్లేవ్ అనేది మాగ్నెటిక్ లీవిటేటషన్‌కు సంక్షిప్త రూపం. అంటే అయస్కాంత శక్తి సహాయంతో రైలు ట్రాక్‌పై కాకుండా గాల్లో తేలుతూ ప్రయాణిస్తుంది. మాగ్లెవ్ రైలు మెరపు వేగంతో ప్రయాణిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (floating train technology).
మాగ్లెవ్ టెక్నాలజీతో నడిచే రైలుకు చక్రాలు ఉండవు. రైలు ట్రాక్‌ను తాకదు (high speed train innovation). శక్తివంతమైన మాగ్నెట్‌లను ట్రాక్, రైలులో అమర్చుతారు. ఆకర్షణ, వికర్షణ శక్తుల వల్ల పట్టాలను రైలు చక్రాలు తాకే పరిస్థితి ఉండదు. ఘర్షణ చాలా తక్కువ కాబట్టి అతి వేగం సాధ్యమవుతుంది. శబ్దం, కంపనాలు చాలా తక్కువగా ఉంటాయి. రైలు పూర్తిగా విద్యుత్ శక్తితో నడుస్తుంది. చైనా తన మొదటి మాగ్లెవ్ రైలు నమూనాను 30 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేసింది. ఆ టెక్నాలజీని క్రమంగా అభివృద్ధి చేసుకుంటూ వస్తోంది. భవిష్యత్తులో, ఈ సాంకేతికత రైలు రవాణాను మాత్రమే కాకుండా అంతరిక్ష, విమానయాన పరిశ్రమలను కూడా మార్చగలదని చాలా మంది నమ్ముతున్నారు.
ఇవి కూడా చదవండి..
వైద్య ప్రపంచంలోనే అద్భుతం.. పాదం మీద చెవి పెట్టి కాపాడారు..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 366ల మధ్యలో 363 ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..