Share News

China medical miracle: వైద్య ప్రపంచంలోనే అద్భుతం.. పాదం మీద చెవి పెట్టి కాపాడారు..

ABN , Publish Date - Dec 28 , 2025 | 03:40 PM

చైనాకు చెందిన సన్ అనే మహిళ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆఫీస్‌లో ఉన్న సమయంలో ఓ పెద్ద ప్రమాదానికి గురైంది. ఓ భారీ యంత్రం ఆమె తల భాగాన్ని కోసేసింది. చైనా డాక్టర్లు వైద్య చరిత్రలో మొట్టి మొదటి సారి ఓ ప్రత్యేకమైన శస్త్ర చికిత్స చేశారు. మహిళ తెగిపోయిన చెవిని తాత్కాలికంగా ఆమె కాలికి అమర్చారు.

China medical miracle: వైద్య ప్రపంచంలోనే అద్భుతం.. పాదం మీద చెవి పెట్టి కాపాడారు..
unbelievable medical news

చైనాలో వైద్యులు ఓ అద్భుతాన్ని చేసి చూపించారు. వైద్య చరిత్రలో మొట్టి మొదటి సారి ఓ ప్రత్యేకమైన శస్త్ర చికిత్స చేశారు. ఒక మహిళ తెగిపోయిన చెవిని తాత్కాలికంగా ఆమె కాలికి అమర్చి, తర్వాత ఆమె తలకు తిరిగి అమర్చారు. ఆ మహిళ సాధారణ జీవితం గడిపేలా చేశారు. చైనాకు చెందిన సన్ అనే మహిళ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆఫీస్‌లో ఉన్న సమయంలో ఓ పెద్ద ప్రమాదానికి గురైంది. ఓ భారీ యంత్రం ఆమె తల భాగాన్ని కోసేసింది (ear placed on foot surgery).


ఆ ప్రమాదంలో సదరు మహిళ తల, మెడ, మొహంపై ఉన్న చర్మం అనేక ముక్కలుగా నలిగిపోయింది. ఆమె చెవి పూర్తిగా తెగిపోయి బయటకు వచ్చేసింది. వైద్యులు సాంప్రదాయ శస్త్రచికిత్స ద్వారా తలపై చర్మాన్ని తిరిగి అతికించడానికి ప్రయత్నించారు. కానీ, పుర్రె కణజాలం, రక్త నాళాలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో చెవిని తిరిగి అతికించడం వెంటనే వీలు పడలేదు. తల చర్మం నయం కావడానికి సమయం పడుతుంది కాబట్టి, వైద్యులు చెవిని సజీవంగా ఉంచడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించారు. ఆ మహిళ కాలికి తెగిపోయిన చెవిని అంటుకట్టారు (rare medical case China).


కాలిలో ఉండే ధమనులు, సిరలు చెవికి అనుకూలంగా ఉంటాయి (shocking medical surgery). అలాగే కాలి మీద చర్మం మందం, తల మీది చర్మం మందాన్ని పోలి ఉంటుంది. దాదాపు పది గంటల పాటు సర్జరీ చేసి కాలిపై చెవిని అమర్చారు. ఆ తర్వాత పొట్టపై ఉన్న చర్మం తీసి తలపై అమర్చారు. ఐదు నెలల తర్వాత ఆ మహిళ మొహంపై వాపు తగ్గి గాయాలన్నీ నయం అయ్యాయి. చివరకు గత నెలలో ఆపరేషన్ చేసి కాలి మీద ఉన్న చెవిని తిరిగి తలకు అమర్చారు. ఆ మహిళ తాజాగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. ఆమె మొహం చాలా వరకు నయమైంది. పూర్తిగా నయం కావడానికి మరికొన్ని సర్జరీలు అవసరమవుతాయని డాక్టర్లు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

రైలు పట్టాల పక్కన సిల్వర్ పెట్టెలు ఎందుకుంటాయి.. వీటి ఉపయోగం ఏంటి..

మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ ఫొటోలో సూది ఎక్కడుందో 25 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 28 , 2025 | 04:33 PM