Railway track silver box: రైలు పట్టాల పక్కన సిల్వర్ పెట్టెలు ఎందుకుంటాయి.. వీటి ఉపయోగం ఏంటి..
ABN , Publish Date - Dec 27 , 2025 | 03:38 PM
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అయిన భారతీయ రైల్వే వ్యవస్థలో సామాన్య ప్రజలకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. రైలు పట్టాల పక్కన సిల్వర్ బాక్స్‌లను మీరు చూసే ఉంటారు. అవి భద్రత విషయంలో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో తెలుసా?
మన దేశంలో రోజుకు కొన్ని లక్షల మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. బస్సు, విమానాల కంటే రైలు ప్రయాణాలనే ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. భారతీయ రైల్వే కూడా ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అయిన భారతీయ రైల్వే వ్యవస్థలో సామాన్య ప్రజలకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. రైలు పట్టాల పక్కన సిల్వర్ బాక్స్‌లను మీరు చూసే ఉంటారు. అవి భద్రత విషయంలో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో తెలుసా? (silver boxes on railway tracks)
ఈ సిల్వర్ బాక్స్‌ల్లో యాక్సిల్ కౌంటర్ సిస్టమ్, సిగ్నలింగ్ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. ఒక ట్రాక్ భాగంలో రైలు ఉందా లేదా అనేది గుర్తించడం ఈ బాక్స్‌ల పని. రైలు ట్రాక్‌లోకి ప్రవేశించినప్పుడు దాని చక్రాల సంఖ్యను ఇవి లెక్కిస్తాయి. అలాగే రైలు బయటకు వెళ్లినప్పుడు మళ్లీ లెక్కిస్తాయి. రెండు లెక్కలూ సరిపోతే ట్రాక్ ఖాళీ అయినట్టు సంకేతం పంపుతాయి. ఒకవేళ సరిపోకపోతే ట్రాక్‌లో ఇంకా రైలు ఉందని సంకేతం పంపుతాయి. ట్రాక్‌లో రైలు ఉంటే సిగ్నల్ ఆటోమేటిక్‌గా ఎరుపు రంగులోకి మారుతుంది. తద్వారా మరో రైలు అదే ట్రాక్‌లోకి రాకుండా ఆగిపోతుంది. రైళ్లు ఢీకొనే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి (railway signaling system).

ఈ బాక్స్‌ల నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే సిగ్నల్ లైట్లు, స్టేషన్ల మధ్య ఇంటర్‌లాకింగ్ సిస్టమ్, కొన్ని చోట్ల ఆటోమేటిక్ బ్రేకింగ్స్ కూడా పనిచేస్తాయి (railway safety equipment). పాత ట్రాక్ సర్క్యూట్లతో పోలిస్తే ఇవి అన్ని రకాల వాతావరణాల్లోనూ పని చేస్తాయి. వర్షం పడుతున్నా, మట్టి, తుప్పు పట్టినా, వరదలు వంటి పరిస్థితుల్లో కూడా ఇవి సరిగా పనిచేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఈ సిల్వర్ బాక్స్‌లు రైల్వే వ్యవస్థకు కళ్లు, మెదడు లాంటివి. వీటిని తాకడం, పాడుచేయడం చట్టపరంగా నేరం.
ఇవి కూడా చదవండి..
కుక్కలు ఎప్పుడూ బైక్‌లు, కార్ల వెంట ఎందుకు పరిగెడతాయి.. అసలు కారణమేంటి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో పిల్లి ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..