Home » Indian Railways
నాగ్‌పూర్ నుంచి ముంబై వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు ఊహించని ఘటన ఎదురైంది. వేగంగా వెళ్తున్న రైలుపైకి బయట నుంచి రాయి విసరడంతో బోగీ కిటికీ అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది.
రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే రైలు మార్గం సికింద్రాబాద్ (ఘట్‌కేసర్)- కాజీపేట సెక్షన్‌లో నాలుగో లైన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వాడి-సికింద్రాబాద్- కాజీపేట మార్గంలో ఉన్న ఈ ట్రాక్‌పై ప్రస్తుతం మూడు లైన్లు ఉన్నా.. వాటి సామర్థ్యాన్ని మించి 120 శాతం మేర రైల్వే ట్రాఫిక్ ఉంటోంది.
దేశంలో రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేలో అత్యంత రద్దీగా ఉండే ఏడు హైడెన్సిటీ కారిడార్లను నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
దేశంలో రద్దీ అత్యధికంగా ఉండే రైలు మార్గాల విస్తరణ దిశగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం కీలక ప్రకటన చేశారు.
రైల్వే ప్రయాణికులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైళ్లలో ప్రయాణించే వారిని ఇకపై 'రెండో క్లాస్ ప్రయాణికులు'అని పిలవొద్దని స్పష్టం చేసింది.
రైల్వే ప్రయాణికుల ఆత్మగౌరవం, భద్రత, ప్రమాద పరిహారానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇకపై ప్రయాణికులను 'రెండవ తరగతి ప్రయాణికులు' అని సంబోధించవద్దని రైల్వే శాఖను ఆక్షేపించింది.
రైలు ప్రయాణికులకు IRCTC గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన, సర్వర్ క్రాష్‌లతో తలపట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మరింత వేగంగా, సులువుగా టికెట్లు బుక్ చేసుకునేలా సరికొత్త డిజైన్‌తో కూడిన కొత్త IRCTC వెబ్‌సైట్‌ను తీసుకొస్తోంది.
రైలు ఏసీ బోగీలో మంగళసూత్రం చోరీ అయిన ఘటనలో ఓ జంటకు నార్తర్న్ రైల్వే రూ.70 వేల పరిహారం చెల్లించాలని పంజాబ్‌లోని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.
కదులుతున్న రైలులో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కదులుతున్న రైలు కోచ్‌లో పూజారి మంత్రోచ్చారణ చేస్తుండగా, పలువురు భక్తులు చుట్టూ కూర్చున్నారు.
రైలులోని ఓ ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌ను ఓ జంట హనీమూన్ సూట్‌లా మార్చుకుంది. బెలూన్లు, గులాబీ పూలు, రోజ్ పేటల్స్, లైట్లతో క్యాబిన్‌ను తమకు నచ్చినట్టు అలంకరించుకుంది. అందుకోసం ఓ ప్రైవేట్ డెకరేటర్‌ను కూడా నియమించుకుంది.