IRCTC Ticket Booking: ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఓ కీలక అప్‌డేట్! నేటి నుంచీ..
ABN , Publish Date - Jan 12 , 2026 | 05:46 PM
అడ్వాన్స్‌గా రైలు టిక్కెట్స్ బుక్ చేసుకునేవారికి ఓ కీలక అప్‌డేట్. ఏఆర్‌పీ తొలి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12.00 గంటల వరకూ ఆధార్ వెరిఫైడ్ యూజర్లు టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఓ కీలక అప్‌డేట్. టిక్కెట్ బుకింగ్ నిబంధనల్లో నేటి నుంచి కొత్త మార్పు అమల్లోకి వచ్చింది. ఆధార్ కార్డు వెరిఫికేషన్ పూర్తయిన యూజర్లు మాత్రమే అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ఏఆర్‌పీ) తొలి రోజున ఆన్‌లైన్‌లో టిక్కెట్స్‌ను బుక్ చేసుకోవచ్చు. మునుపటి నిబంధనల ప్రకారం, ఏఆర్‌పీ తొలి రోజున ఆధార్ వెరిఫైడ్ యూజర్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ టిక్కెట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. తాజాగా ఈ నిబంధనలో మార్పు చేశారు. అయితే, ప్యాసింజర్ రిజర్వేషన్ కౌంటర్ నిబంధనల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని ఐఆర్‌సీటీసీ పేర్కొంది (IRCTC ticket booking update).
ప్రయాణ తేదీకి ముందు 60 రోజుల కాలాన్ని ఏఆర్‌పీ అంటారన్న విషయం తెలిసిందే. ఈ కాల వ్యవధిలో ప్రయాణికులు ముందస్తుగా టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఏఆర్‌పీ తొలి రోజున ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. రెండో రోజు నుంచీ నాన్ ఆధార్ వెరిఫైడ్ యూజర్లు కూడా యథాప్రకారం టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చు. అసలైన ప్యాసెంజర్లకు కన్‌ఫర్మ్‌డ్ టిక్కెట్స్ లభించేలా ఈ చర్య తీసుకున్నట్టు ఐఆర్‌సీటీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఆన్‌లైన్‌లో తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు రైల్వే శాఖ ఇప్పటికే ఆధార్ వెరిఫికేషన్ (ఓటీపీ సాయంతో..) తప్పనిసరి చేసింది. గతేడాది జులై 15 నుంచి ఈ నిబంధనను అమల్లో ఉంది.
ఇవీ చదవండి:
సామాన్యులకే వందేభారత్ స్లీపర్.. వీఐపీ కోటాకు నో ఛాన్స్!
ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ విన్నర్ కన్నుమూత