Bengaluru–Vijayawada Highway: బెంగళూరు-విజయవాడ హైవే.. నాలుగు గిన్నీస్ రికార్డులు..
ABN , Publish Date - Jan 12 , 2026 | 01:27 PM
బెంగళూరు-విజయవాడ రహదారి నిర్మాణంలో రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ కాంట్రాక్ట్ సంస్థ 4 గిన్నిస్ రికార్డులు నెలకొల్పింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం వర్చువల్‌గా ఆ సంస్థ యాజమాన్యానికి ధ్రువీకరణ పత్రాలను అందించారు.
బెంగళూరు-విజయవాడ రహదారి నిర్మాణంలో రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ కాంట్రాక్ట్ సంస్థ 4 గిన్నిస్ రికార్డులు నెలకొల్పింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం వర్చువల్‌గా ఆ సంస్థ యాజమాన్యానికి ధ్రువీకరణ పత్రాలను అందించారు. అద్భుతమైన రికార్డు నెలకొల్పినందుకు రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్‌ను ఇరువురూ అభినందించారు (Guinness World Records highway).
ఈ నెల ఆరో తేదీన సత్యసాయి పుట్టపర్తి జిల్లా బొంతలపల్లి సమీపంలో 28.89 కిలో మీటర్ల పొడవైన రహదారిని కేవలం 24 గంటల్లో పూర్తి చేసి తొలి రికార్డు సాధించింది. అలాగే 24 గంటల్లో అత్యధికంగా 10,655 టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను విరామం లేకుండా వేసి రెండో రికార్డు సాధించింది. ఇక, ఈ నెల 11వ తేదీ వరకు 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను నిర్విరామంగా వేసి మూడో రికార్డు దక్కించుకుంది. అలాగే మొత్తం 156 లేన్ కిలోమీటర్ల పొడవైన రహదారి (26 కి.మీ. మేర 6 వరుసలు)ని నిర్విరామంగా వేసి నాలుగో రికార్డు సాధించింది (India road construction records).
ఇంత ప్రత్యేకమైన ఘనత సాధించినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలియజేశారు (Bengaluru Vijayawada NH news). మన ఇంజినీర్లు, అధికారులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు, ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన ప్రతిఒక్కరికీ అభినందనలని గడ్కరీ పేర్కొన్నారు. అలాగే నూతన సాంకేతికతతో తక్కువ సమయంలో రహదారుల నిర్మాణం వేగంగా పూర్తిచేశారని, నాణ్యత విషయంలో రాజీ లేకుండా రోడ్ల నిర్మాణం జరుగుతోందని కొనియాడారు.
ఇవి కూడా చదవండి..
ఇంటి ఖర్చుల లెక్కలు అడిగిన భర్తపై కేసు.. సుప్రీం కోర్టు తీర్పు ఏంటంటే..
మూడు పాములతో హాస్పిటల్‌కు.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..