Share News

Husband wife legal case: ఇంటి ఖర్చుల లెక్కలు అడిగిన భర్తపై కేసు.. సుప్రీం కోర్టు తీర్పు ఏంటంటే..

ABN , Publish Date - Jan 12 , 2026 | 09:00 AM

సాధారణంగా భార్యాభర్తల మధ్య ఇంటి లావాదేవీల గురించి చర్చలు జరుగుతుంటాయి. ఇంటి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులకు సంబంధించిన లెక్కల గురించి భార్యను భర్త అడగడం అనేది సర్వ సాధారణమే. అయితే అలా అడగడం తప్పంటూ ఒక భర్తపై భార్య కోర్టుకెక్కింది.

Husband wife legal case: ఇంటి ఖర్చుల లెక్కలు అడిగిన భర్తపై కేసు.. సుప్రీం కోర్టు తీర్పు ఏంటంటే..
financial control not cruelty

సాధారణంగా భార్యాభర్తల మధ్య ఇంటి లావాదేవీల గురించి చర్చలు జరుగుతుంటాయి. ఇంటి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులకు సంబంధించిన లెక్కల గురించి భార్యను భర్త అడగడం అనేది సర్వ సాధారణమే. అయితే అలా అడగడం తప్పంటూ ఒక భర్తపై భార్య కోర్టుకెక్కింది. భర్తపై సెక్షన్ 498A వంటి తీవ్రమైన క్రిమినల్ కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఇంటి ఖర్చుల లెక్కలు అడగడాన్ని నేరపూరిత క్రూరత్వంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది (Supreme Court 498A verdict).


ఈ కేసుకు కారణమైన భార్యాభర్తలు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేసేవారు. వారికి 2016లో వివాహం జరిగింది. 2019లో ఒక కొడుకు జన్మించాడు. భర్తతో వివాదం కారణంగా బిడ్డతో సహా భార్య భారతదేశానికి తిరిగి వచ్చేసింది. అప్పటి నుంచి భర్తతో కలిసి ఉండటం లేదు. జనవరి 2022లో భర్త ఆమెకు లీగల్ నోటీసు పంపాడు. తనతో కలిసి జీవించాలని డిమాండ్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత భార్య తన భర్త, అతని కుటుంబంపై 498A కేసు పెట్టింది (financial control not cruelty).


తన భర్త తనను ఇంటి ఖర్చుల పూర్తి లెక్కలు చెప్పమని అడిగేవాడని, దానిని ఎక్సెల్ షీట్‌లో రాయమని కోరేవాడని పిటిషన్‌లో పేర్కొంది (husband wife legal case). అతని తల్లిదండ్రులకు డబ్బు పంపేవాడని, తాను బరువు పెరగడం గురించి ఎగతాళి చేసేవాడని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు రోజువారీ వైవాహిక సంఘర్షణలకు కారణం కావచ్చని, అంతే తప్ప నేరపూరిత క్రూరత్వం కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. వ్యక్తిగత కక్షలను పరిష్కరించడానికి సెక్షన్ 498A వంటి చట్టాన్ని ఉపయోగించరాదని కోర్టు స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

మూడు పాములతో హాస్పిటల్‌కు.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..

Updated Date - Jan 12 , 2026 | 09:26 AM